Telugu Global
Cinema & Entertainment

తెలుగులోకి మరో అంతఃపురం

ఆర్య, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా అరణ్మణై-3. ఇప్పుడీ సినిమా తెలుగులో అంతఃపురంగా వస్తోంది. హారర్ కామెడీ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా, సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల లాంటి నటులంతా ఉన్నారు. సుందర్ సి దర్శకుడు. తెలుగులో చంద్రకళగా విడుదలైన ‘అరణ్మణై’, ‘కళావతి’గా విడుదలైన ‘అరణ్మణై 2’ సినిమాలకు ఓ మోస్తరు గుర్తింపు వచ్చింది. అందుకే అరణ్మణై-3ని కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. పైగా రాశిఖన్నా హీరోయిన్ అవ్వడం, […]

తెలుగులోకి మరో అంతఃపురం
X

ఆర్య, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా అరణ్మణై-3. ఇప్పుడీ సినిమా తెలుగులో అంతఃపురంగా వస్తోంది. హారర్ కామెడీ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా, సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల లాంటి నటులంతా ఉన్నారు. సుందర్ సి దర్శకుడు.

తెలుగులో చంద్రకళగా విడుదలైన ‘అరణ్మణై’, ‘కళావతి’గా విడుదలైన ‘అరణ్మణై 2’ సినిమాలకు ఓ మోస్తరు గుర్తింపు వచ్చింది. అందుకే అరణ్మణై-3ని కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. పైగా రాశిఖన్నా హీరోయిన్ అవ్వడం, టాలీవుడ్ మార్కెట్ కు కలిసొస్తుంది. కెరీర్ లో రాశిఖన్నా చేసిన మొట్టమొదటి హారర్-కామెడీ సినిమా ఇదే.

గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై ఎ.సి.ఎస్ అరుణ్ కుమార్ సమర్పణలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 31న ఏపీ,నైజాంలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది అంతఃపురం సినిమా.

Next Story