Telugu Global
NEWS

ఏపీలో త‌గ్గ‌నున్న లిక్క‌ర్ ధ‌ర‌లు

లిక్క‌ర్ వ్యాట్ రేట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పు చేసింది. వ్యాట్, అడిషిన‌ల్‌ ఎక్సైజ్ డ్యూటీ, స్పెష‌ల్‌ మార్జిన్ స‌వ‌రించింది. ఈ మేర‌కు రెవెన్యూ శాఖ స్పెష‌ల్ సీఎస్‌ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, అడిషిన‌ల్‌ ఎక్సైజ్ డ్యూటీ, స్పెష‌ల్‌ మార్జిన్ స‌వ‌రణ‌ల ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 […]

ఏపీలో త‌గ్గ‌నున్న లిక్క‌ర్ ధ‌ర‌లు
X

లిక్క‌ర్ వ్యాట్ రేట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పు చేసింది. వ్యాట్, అడిషిన‌ల్‌ ఎక్సైజ్ డ్యూటీ, స్పెష‌ల్‌ మార్జిన్ స‌వ‌రించింది. ఈ మేర‌కు రెవెన్యూ శాఖ స్పెష‌ల్ సీఎస్‌ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, అడిషిన‌ల్‌ ఎక్సైజ్ డ్యూటీ, స్పెష‌ల్‌ మార్జిన్ స‌వ‌రణ‌ల ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది.

బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎల్‌ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్‌ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది.

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం వ‌చ్చే వారం నుంచి విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

First Published:  18 Dec 2021 10:43 AM GMT
Next Story