Telugu Global
Cinema & Entertainment

గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న హిట్-2

‘క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు’ వంటి వైవిధ్య‌మై సినిమాల్లో హీరోగా న‌టించి త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్‌. ఈ వెర్స‌టైల్ హీరో ఇప్పుడు దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ ‘మేజ‌ర్‌’తో పాటు సీట్ ఎడ్జ్ క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హిట్ 2’తోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నాడు. ‘హిట్ 2’ను హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తున్నారు. అడివి శేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హిట్-2 సినిమా నుంచి […]

గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న హిట్-2
X

‘క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు’ వంటి వైవిధ్య‌మై సినిమాల్లో హీరోగా న‌టించి త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్‌. ఈ వెర్స‌టైల్ హీరో ఇప్పుడు దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ ‘మేజ‌ర్‌’తో పాటు సీట్ ఎడ్జ్ క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హిట్ 2’తోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నాడు. ‘హిట్ 2’ను హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తున్నారు. అడివి శేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హిట్-2 సినిమా నుంచి గ్లింప్స్‌ను నాని విడుద‌ల చేశాడు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డిగా కనిపించనున్నాడు అడివి శేష్.

గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్‌లో అడివి శేష్ ఏదో కేస్‌ను చేధించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను చేయ‌డం.. ఏదో అన్వేషిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు. త‌న లుక్ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా ఉంది. త‌న‌తో పాటు ఓ పోలీస్ డాగ్ ఉండ‌టాన్ని ఈ గ్లింప్స్‌లో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే విల‌న్స్‌ భ‌ర‌తం ప‌ట్టే పోలీస్ ఆఫీస‌ర్‌గానూ అడివి శేష్‌ను మ‌నం చూడొచ్చు.

ఇదే బ్యాన‌ర్‌లో రూపొంది ఘన విజయం సాధించిన ‘హిట్‌’ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందుతోన్న చిత్రమే ‘హిట్ ‌2’. ‘ది సెకండ్‌ కేస్‌’ సినిమా ట్యాగ్‌లైన్‌. హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే ‘హిట్ 2’ కూడా వస్తోంది. సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్త‌యింది, త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

First Published:  18 Dec 2021 7:23 AM GMT
Next Story