Telugu Global
NEWS

సినిమా టికెట్ల రేట్లు తగ్గాయి.. పెన్షనర్లకు సాయం పెరిగింది..

ఏపీలో ఈ రోజు పలు కీలక పరిణామాలు జరిగాయి. వృద్ధులు, వితంతువులు, ఇతర చేతివృత్తులవారికి ఇచ్చే సామాజిక పింఛన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకూ 2250 రూపాయలు నెలవారీ పింఛన్ ఇస్తుండగా.. ఇకపై అది 2500 రూపాయలకు చేరుకుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాజిక పింఛన్లను 3వేల రూపాయలకు పెంచుతానంటూ జగన్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం విడతలవారీగా పింఛన్లను పెంచుతున్నారు. గతంలో 2 […]

సినిమా టికెట్ల రేట్లు తగ్గాయి.. పెన్షనర్లకు సాయం పెరిగింది..
X

ఏపీలో ఈ రోజు పలు కీలక పరిణామాలు జరిగాయి. వృద్ధులు, వితంతువులు, ఇతర చేతివృత్తులవారికి ఇచ్చే సామాజిక పింఛన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకూ 2250 రూపాయలు నెలవారీ పింఛన్ ఇస్తుండగా.. ఇకపై అది 2500 రూపాయలకు చేరుకుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాజిక పింఛన్లను 3వేల రూపాయలకు పెంచుతానంటూ జగన్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం విడతలవారీగా పింఛన్లను పెంచుతున్నారు. గతంలో 2 వేలనుంచి 2250లకు పింఛన్ ను పెంచగా.. ఇప్పుడు రూ.2500 చేశారు. వికలాంగులకు ఇచ్చే పింఛన్ కూడా పెరుగుతుంది.

సినిమా టికెట్ల జీవో సస్పెన్షన్..
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ, టికెటింగ్ వ్యవస్థను ఆన్ లైన్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 35ను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత పద్ధతిలోనే సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యానికి అవకాశం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంతో గతంలోనే పలువురు సినిమా హీరోలు, నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నటీనటులు ప్రభుత్వంపై సంప్రదింపులు జరుపుతున్నవేళ, థియేటర్ల యాజమాన్యాలు ఏకంగా కోర్టు మెట్లెక్కాయి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. సినిమా టికెట్ల రేట్లను సవరించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. జీవోను సస్పెండ్ చేసింది.

ఫిట్ మెంట్ పై కుదరని సయోధ్య..
ఇక ఏపీలో జరిగిన మరో కీలక పరిణామం ఉద్యోగుల జీతభత్యాలపై చర్చ. ప్రభుత్వ ఉద్యోగులు 45శాతం వేతన పెంపు కోరుతుండగా.. ప్రభుత్వం కుదరదని చెప్పింది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ కూడా పీఆర్సీ పెంపుపై నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగుల చర్చలు ముగిశాయి. 14.29 శాతం ఫిట్ మెంట్ కి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంతకంటే పెంచడం సాధ్యం కాదని ఆయన ఉద్యోగ సంఘాల నాయకులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేదని ఉద్యోగుల కోరికను మన్నించలేమని చెప్పారు. సీపీఎస్ రద్దు విషయంలో కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని, త్వరలో దీనిపై కూడా క్లారిటీ వస్తుందని చెప్పారు సజ్జల.

First Published:  14 Dec 2021 9:50 AM GMT
Next Story