Telugu Global
WOMEN

Female health problems: ఆడవాళ్లకు ఏయే వయసుల్లో ఎలాంటి సమస్యలొస్తాయంటే..

female health problems: మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల వయసు నుంచి ఐదుపదుల వయసు వరకూ మహిళల్లో రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

Female health problems
X

Female health problems: ఆడవాళ్లకు ఏయే వయసుల్లో ఎలాంటి సమస్యలొస్తాయంటే..

మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల వయసు నుంచి ఐదుపదుల వయసు వరకూ మహిళల్లో రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వయసుల వారీగా మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే

టీనేజ్‌లో

టీనేజ్‌లో అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య రక్తహీనత. అందుకే టీనేజ్‌లో ఉన్న ఆడ పిల్లలకు తరచూ హిమోగ్లోబిన్‌ టెస్ట్ చేయిస్తూ ఉండాలి. దాంతో పాటు ఈ వయసులో ఆడపిల్లలకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, డ్రైనట్స్‌, పప్పులు లాంటివి ఎక్కువగా పెడుతుండాలి.

యంగ్ ఏజ్‌లో..

ఇరవై ఎళ్లు దాటాక మహిళల్లో బరువు పెరగటం, జుట్టురాలిపోవటం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్‌ పరీక్ష చేయించాలి. థైరాయిడ్ సమస్య మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో మూడురెట్లు ఎక్కువని స్టడీలు చెప్తున్నాయి.

పాతికేళ్ల వయసులో..

పాతికేళ్ల వయసుకు చేరుకోగనే కొంతమంది మహిళల్లో మోనోపాజ్ సమస్యలు, గర్భాశయ సమస్యలు లాంటివి వస్తుంటాయి. గర్భాశయ క్యాన్సర్లు వచ్చే వయసు కూడా ఇదే.. అందుకే ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు ఎలాంటి సమస్య వచ్చినా గర్భాశయ టెస్టులు చేయించుకోవడం మంచిది.

ముప్ఫై దాటాక

ముప్ఫైల్లోకి ఎంటర్ అయిన ప్రతి మహిళ ఓసారి మామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవడం అవసరం. ఎందుకంటే మనదేశంలో ఏటా 10 లక్షలకు పైగా రొమ్ము క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. అందులో ఈ ముప్ఫై దాటిన వయసు వాళ్లే ఎక్కువ.

మధ్య వయసులో..

40 ఏళ్ల వయసులో మహిళలకు ఎక్కువగా డయాబెటిస్ వస్తుంటుంది. కొంతమందిలో ఇది ఎలాంటి లక్షణాలు లేకుండా మెల్లగా పెరుగుతుంటుంది. అందుకే ఈ వయసు వాళ్లు తరచూ షుగర్ టెస్ట్ చేయిస్తూ ఉండాలి. హెల్దీ ఫుడ్స్ తింటుండాలి.

వయసు పైబడితే..


యాభై ఏళ్లు దాటాక మహిళల్లో జీర్ణ సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ వయసు మహిళలు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.

First Published:  4 Jan 2023 8:45 PM GMT
Next Story