Telugu Global
National

అధికారుల వెనకడుగు.. వ్యాక్సిన్ వేయించుకోకపోయినా మీనాక్షి దర్శనం..

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నవేళ.. అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కఠినతరం అవుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లోకి వచ్చే భక్తులకు రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి చేశారు అధికారులు. ప్రస్తుతం తిరుమలలో ఈ నిబంధన అమలులో ఉంది. శబరిమల యాత్రకు కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా దీనిపై కఠిన నిర్ణయం తీసుకుంది. మదురై జిల్లాలో రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే పబ్లిక్ ప్లేస్ లలో తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు ఆదేశాలు జారీ […]

అధికారుల వెనకడుగు.. వ్యాక్సిన్ వేయించుకోకపోయినా మీనాక్షి దర్శనం..
X

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నవేళ.. అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కఠినతరం అవుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లోకి వచ్చే భక్తులకు రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి చేశారు అధికారులు. ప్రస్తుతం తిరుమలలో ఈ నిబంధన అమలులో ఉంది. శబరిమల యాత్రకు కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా దీనిపై కఠిన నిర్ణయం తీసుకుంది. మదురై జిల్లాలో రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే పబ్లిక్ ప్లేస్ లలో తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు వ్యాక్సినేషన్ కోసం వారం రోజుల గడువు విధించారు. అది పూర్తి కాగానే కొత్త నిబంధన అమలులోకి తెచ్చారు. రేషన్ దుకాణాలు, ప్రైవేటు వ్యాపార ప్రాంగణాలు, బ్యాంకులు లిక్కర్ షాపుల్లో కూడా ఈ నిబంధన అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ అధికారులు మదుర మీనాక్షి ఆలయం, రామేశ్వరాలయంలో కూడా ఈ నిబంధన తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు.

ఒక్కరోజులోనే నిర్ణయం మార్పు..
శనివారం వ్యాక్సినేషన్ నిబంధన తీసుకు రాగా.. ఆదివారం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు దేవాదాయ శాఖ అధికారులు. వ్యాక్సిన్ వేయించుకోనివారికి కూడా మదుర మీనాక్షి దర్శనం కల్పిస్తామన్నారు. అలాగే రామేశ్వరంలో కూడా వ్యాక్సిన్ లేకపోతే ఆలయంలోకి నో ఎంట్రీ అనే నిబంధన పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

ఎందుకీ వెనకడుగు..?
ఓవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు పెరుగుతుండటంతో అన్ని చోట్ల ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. అయితే ఈ నియమ నిబంధనలను చాలామంది పట్టించుకోవడంలేదు. ఆఫీస్ లు, వాణిజ్య ప్రాంతాల్లోకి వచ్చేవారిని ఎవరూ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు అడగడంలేదు, కనీసం చెక్ చేయడం లేదు. అలాంటి సందర్భాల్లో కేవలం ఆలయాలకు మాత్రమే ఈ నిబంధనలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది. హిందూ ఆలయాలపై వివక్ష చూపిస్తున్నారని, భక్తులకు దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఒక్కరోజులోనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వ్యాక్సిన్ లేకపోయినా మీనాక్షి ఆలయంలో దర్శనాలకు ఆటంకం లేదని ప్రకటించారు.

Next Story