Telugu Global
Cinema & Entertainment

మరో బాంబు పేల్చిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఈ రాజీనామాల అంశాన్ని పెండింగ్ లో ఉంచిన నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, ఎట్టకేలకు వాటిపై నిర్ణయం తీసుకున్నారు. “ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాను. కానీ వారు […]

మరో బాంబు పేల్చిన మంచు విష్ణు
X

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఈ రాజీనామాల అంశాన్ని పెండింగ్ లో ఉంచిన నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, ఎట్టకేలకు వాటిపై నిర్ణయం తీసుకున్నారు.

“ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాను. కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగింది. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాను. అయితే వారు ‘మా’ సభ్యులుగా కొనసాగుతారు.”

ఈ సందర్భంగా నాగబాబు, ప్రకాష్ రాజ్ చేసిన రాజీనామాలపై కూడా స్పందించాడు మంచు విష్ణు. వీళ్లిద్దరూ తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వీటిని మాత్రం అంగీకరించడం లేదని స్పష్టంచేశాడు విష్ణు. మా సభ్యత్వాలు యథాతథంగా కొనసాగుతాయన్నాడు. ఇక మా బిల్డింగ్ కు సంబంధించి వారం రోజుల్లో ప్రకటన చేస్తామన్నాడు విష్ణు.

First Published:  13 Dec 2021 5:00 AM GMT
Next Story