Telugu Global
National

మోదీ ట్వీట్.. నెటీజ‌న్లు షాక్.. 

ఉన్నట్టుండి ఈ తెల్లవారు ఝామున ప్రధాని నరేంద్రమోదీ అధికారిక ట్విట్టర్ ఖాతానుంచి ఓ ట్వీట్ వచ్చింది. భారత్ లో బిట్ కాయిన్లను అధికారికం చేశామనేది దాని సారాంశం. అంతే కాదు.. భారతీయులందరి ఖాతాల్లో 500 బిట్ కాయిన్లు జమ చేశామని కూడా అందులో ఉంది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు షాకయ్యారు. మోదీని ఫాలో అయ్యేవారంతా దాన్ని లైక్ చేసి, రీట్వీట్ చేశారు. కానీ ఎక్కడో ఏదో చిన్న అనుమానం. ఇలాంటి ట్వీట్ నేరుగా ప్రధాని చేయడమేంటి అని […]

మోదీ ట్వీట్.. నెటీజ‌న్లు షాక్.. 
X
ఉన్నట్టుండి ఈ తెల్లవారు ఝామున ప్రధాని నరేంద్రమోదీ అధికారిక ట్విట్టర్ ఖాతానుంచి ఓ ట్వీట్ వచ్చింది. భారత్ లో బిట్ కాయిన్లను అధికారికం చేశామనేది దాని సారాంశం. అంతే కాదు.. భారతీయులందరి ఖాతాల్లో 500 బిట్ కాయిన్లు జమ చేశామని కూడా అందులో ఉంది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు షాకయ్యారు. మోదీని ఫాలో అయ్యేవారంతా దాన్ని లైక్ చేసి, రీట్వీట్ చేశారు. కానీ ఎక్కడో ఏదో చిన్న అనుమానం. ఇలాంటి ట్వీట్ నేరుగా ప్రధాని చేయడమేంటి అని షాకయ్యారంతా. ఎందుకైనా మంచిదని కొంతమంది దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు. మొత్తమ్మీద అనుకున్నదే అయింది. మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది.
ప్రధాని అకౌంట్ కే దిక్కులేదా..?
అధికారులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారి ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కి గురికావడం పరిపాటి. కానీ భారత్ లో పెద్దగా అలాంటి సంఘటనలు జరిగిన ఉదాహరణలు లేవు. తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాలోకి చొరబడి అందరికీ షాకిచ్చారు హ్యాకర్లు. అక్కడితో ఆగకుండా బిట్ కాయిన్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి కామెడీ చేశారు.
మోదీ పై పంచ్ పడిందిగా..?
విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని భారత్ కు తెప్పిస్తామని, ప్రజలందరి ఖాతాల్లో జమచేస్తామని గతంలో బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా బ్లాక్ మనీ పంపకంపై స్టేట్ మెంట్లిచ్చారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ బ్లాక్ మనీ భారత్ కు వచ్చింది లేదు, దానివల్ల సామాన్యులకు ఒరిగిందీ లేదు. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాల్లో దీన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంటాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ప్రజలందరి ఖాతాల్లో 500 బిట్ కాయిన్లు జమ చేస్తామంటూ ప్రధాని పేరుతో హ్యాకర్లు ట్వీట్ చేయడంతో ఆయన్ని దారుణంగా ట్రోల్ చేసినట్టయింది. బ్లాక్ మనీ వెనక్కి తేలేని ప్రభుత్వం బిట్ కాయిన్లు వేస్తుందా అని సెటైర్లు పడ్డాయి.
ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ..
హ్యాకర్లు ట్వీట్ చేసిన కొంత సేపటికే ప్రధాని కార్యాలయం ఈ వ్యవహారాన్ని గుర్తించింది. ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే దాన్ని సరిచేశారు. ఆ ట్వీట్ ని తొలగించారు. కాసేపు ట్విట్టర్ అకౌంట్ ని హోల్డ్ లో ఉంచారు. అనంతరం యధావిధిగా ఆ ఖాతాను పునరుద్ధరించారు. ఆ తర్వాత ప్రధాని కార్యాలయం అధికారికంగా ట్వీట్‌ చేసింది. ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయిందని, పొరపాటున వచ్చిన ఆ ట్వీట్స్ ని ఎవరు పరిగణలోకి తీసుకోవద్దని కోరింది.
First Published:  12 Dec 2021 12:07 AM GMT
Next Story