Telugu Global
National

బేటీ బచావో.. బేటీ పఢావో.. ప్రచారానికే 80శాతం నిధులు ఖర్చు..

మోదీ హయాంలో పథకాల అమలుకంటే వాటి ప్రచానికే ఖర్చు ఎక్కువ అవుతోందనే వాదన అన్నిచోట్లా వినపడుతోంది. తాజాగా బేటీ బచావో.. బేటీ పఢావో కార్యక్రమానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం పార్లమెంటరీ కమిటీ బయటపెట్టింది. మహిళా సాధికారతపై హీనా విజయ్ కుమార్ గవిట్ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అసలు విషయాన్ని అందరి ముందుంచింది. బేటీ బచావో.. బేటీ పఢావో.. కార్యక్రమం కోసం కేటాయించిన బడ్జెట్ లో 80శాతం నిధులు కేవలం ప్రచానికే ఖర్చయ్యాయని తేల్చింది. 2015 […]

బేటీ బచావో.. బేటీ పఢావో.. ప్రచారానికే 80శాతం నిధులు ఖర్చు..
X

మోదీ హయాంలో పథకాల అమలుకంటే వాటి ప్రచానికే ఖర్చు ఎక్కువ అవుతోందనే వాదన అన్నిచోట్లా వినపడుతోంది. తాజాగా బేటీ బచావో.. బేటీ పఢావో కార్యక్రమానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం పార్లమెంటరీ కమిటీ బయటపెట్టింది. మహిళా సాధికారతపై హీనా విజయ్ కుమార్ గవిట్ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అసలు విషయాన్ని అందరి ముందుంచింది. బేటీ బచావో.. బేటీ పఢావో.. కార్యక్రమం కోసం కేటాయించిన బడ్జెట్ లో 80శాతం నిధులు కేవలం ప్రచానికే ఖర్చయ్యాయని తేల్చింది.

2015 జనవరిలో బేటీ బచావో.. బేటీ పఢావో.. కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. గర్భస్థ శిశువుల భ్రూణ హత్యలను ఆపేందుకు బాల బాలికల జనాభా నిష్పత్తిని పెంచేందుకు, బాలికల విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016-19 మధ్య కాలంలో 446.72 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించారు. అందులో 78.91 శాతం నిధులు కేవలం ప్రచారం కోసమే ఖర్చు చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, రేడియో, టీవీల్లో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ల కోసం వీటిని ఖర్చు చేశారు.

మరీ ఇంత దారుణమా..?
కొన్ని పథకాలను మొదలు పెట్టే సమయంలోనే.. నిధులను ఎలా ఉపయోగించాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటారు. బేటీ బచావో.. బేటీ పఢావో.. కార్యక్రమం విషయంలో మాత్రం ఇలాంటి కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. అయితే కేటాయింపుల సంగతి ఎలా ఉన్నా.. గుంపగుత్తగా 80శాతం నిధుల్ని కేవలం ప్రచారం కోసమే ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా బాలికల విద్యకోసం నిధులు ఖర్చు చేయాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

First Published:  10 Dec 2021 11:48 PM GMT
Next Story