Telugu Global
NEWS

ఏపీలో మాస్క్ లేకపోతే జరిమానా.. తక్షణం అమలులోకి..

ఏపీ ప్రభుత్వం మరోసారి కొవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. తక్షణం ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు కఠినతరం అయ్యాయి. తెలంగాణలో మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పడు ఏపీలో కూడా జరిమానాలు మొదలు పెడుతున్నారు. అక్కడ వెయ్యి.. ఇక్కడ వంద.. ఏపీలో మాత్రం జరిమానా వంద రూపాయలకు సరిపెట్టడం విశేషం. తెలంగాణలో మాస్క్ […]

ఏపీలో మాస్క్ లేకపోతే జరిమానా.. తక్షణం అమలులోకి..
X

ఏపీ ప్రభుత్వం మరోసారి కొవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. తక్షణం ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు కఠినతరం అయ్యాయి. తెలంగాణలో మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పడు ఏపీలో కూడా జరిమానాలు మొదలు పెడుతున్నారు.

అక్కడ వెయ్యి.. ఇక్కడ వంద..
ఏపీలో మాత్రం జరిమానా వంద రూపాయలకు సరిపెట్టడం విశేషం. తెలంగాణలో మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల భారీ జరిమానాతో అధికారులు హడలెత్తిస్తుండగా ఏపీలో మాత్రం మాస్క్ లేకపోతే వంద రూపాయలు జరిమానా వసూలు చేస్తారు. మాస్క్‌ లేని వారిని దుకాణాలకు రానిస్తే యాజమాన్యాలకు భారీగా జరిమానా విధించబోతున్నారు. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థలకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

షాపులకు షాకే..
మాస్క్ లేని వారిని షాపుల్లోకి రానిస్తే.. యాజమాన్యాలు గరిష్టంగా పాతిక వేల రూపాయలు జరిమానా వేస్తారు. జరిమానా చెల్లించకపోయినా, మార్గదర్శకాలను ఉల్లంఘించినా.. 2 రెండు రోజుల పాటు షాపులకు మూతపడుతుంది. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే మాత్రం విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. కరోనా నిబంధనల ఉల్లంఘించినవారి గురించి వాట్సాప్‌ ద్వారా 80109 68295 నంబరుకు ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని సూచించింది. మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.

First Published:  10 Dec 2021 9:59 AM GMT
Next Story