Telugu Global
Cinema & Entertainment

రేపు ఏకంగా 8 సినిమాలు రిలీజ్

అఖండ సినిమా థియేటర్లలో కొనసాగుతోంది. బి, సి సెంటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఓవైపు ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంటే, మరోవైపు అఖండకు పోటీగా ఏకంగా 8 సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు అఖండ ప్రభంజనాన్ని అడ్డుకుంటాయో చూడాలి నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాతో పాటు గమనం అనే సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమాలు ఇవే. లక్ష్య సినిమా లవ్, స్పోర్ట్స్ […]

రేపు ఏకంగా 8 సినిమాలు రిలీజ్
X

అఖండ సినిమా థియేటర్లలో కొనసాగుతోంది. బి, సి సెంటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఓవైపు ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంటే, మరోవైపు అఖండకు పోటీగా ఏకంగా 8 సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు అఖండ ప్రభంజనాన్ని అడ్డుకుంటాయో చూడాలి

నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాతో పాటు గమనం అనే సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమాలు ఇవే. లక్ష్య సినిమా లవ్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. ఇక గమనం సినిమా ఓ అంథాలజీ మూవీ. 5 కథల సమాహారం. నిత్యామీనన్, శ్రియ, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ నటించిన సినిమా ఇది.

ఈ 2 సినిమాలతో పాటు.. మడ్డీ, కఠారి కృష్ణ, బుల్లెట్ సత్యం, నయీం డైరీస్, ప్రియతమా, మనవూరి పాండవులు సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.

First Published:  9 Dec 2021 8:50 AM GMT
Next Story