Telugu Global
Cinema & Entertainment

'సిరివెన్నెల' ఆఖరి పాట విడుదల

లెజెండ‌రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చివ‌రి పాటను, నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం రాశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శాస్త్రిగారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున సిరివెన్నెల పాటను రికార్డ్ చేశారు. శ్యామ్ సింగరాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి అంకితం ఇచ్చారు మేక‌ర్స్‌. ఈరోజు సిరివెన్నెల చివ‌రి పాట‌ను విడుద‌ల‌చేశారు. నాని, సాయిపల్లవి మధ్య […]

సిరివెన్నెల ఆఖరి పాట విడుదల
X

లెజెండ‌రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చివ‌రి పాటను, నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం రాశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శాస్త్రిగారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున సిరివెన్నెల పాటను రికార్డ్ చేశారు. శ్యామ్ సింగరాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి అంకితం ఇచ్చారు మేక‌ర్స్‌. ఈరోజు సిరివెన్నెల చివ‌రి పాట‌ను విడుద‌ల‌చేశారు.

నాని, సాయిపల్లవి మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమ కథను చిత్రీకరించే ఈ మనోహరమైన పాట‌కు మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. నాని, సాయిప‌ల్ల‌వి కేవ‌లం రాత్రుల‌లోనే క‌లుస్తారు. వారు క‌లిసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది సాయి ప‌ల్ల‌వి. వారు సినిమా హాలు, ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్తుంటారు. వారిద్ద‌రి మ‌ధ్య క్లాసిక్ కెమిస్ట్రీ ఈ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చింది. సిరివెన్నెలగారి సాహిత్యం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను మనోహరంగా పాడారు.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

First Published:  7 Dec 2021 9:06 AM GMT
Next Story