Telugu Global
National

తమిళ సూపర్ స్టార్ రజినీతో శశికళ భేటీ..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో అన్నా డీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ భేటీ కావడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలోని బోయ్స్ గార్డెన్స్ లో ఉన్న రజినీకాంత్ నివాసానికి ఇవాళ సాయంత్రం శశికళ వెళ్లారు. దాదాపు 50 నిమిషాల పాటు శశికళ రజినీకాంత్ తో భేటీ అయ్యారు. ఇది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. నిన్న అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, ఉప సమన్వయకర్తగా ఎడప్పాడి పళని […]

తమిళ సూపర్ స్టార్ రజినీతో శశికళ భేటీ..!
X

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో అన్నా డీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ భేటీ కావడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలోని బోయ్స్ గార్డెన్స్ లో ఉన్న రజినీకాంత్ నివాసానికి
ఇవాళ సాయంత్రం శశికళ వెళ్లారు. దాదాపు 50 నిమిషాల పాటు శశికళ రజినీకాంత్ తో భేటీ అయ్యారు. ఇది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.

నిన్న అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, ఉప సమన్వయకర్తగా ఎడప్పాడి పళని స్వామిని ఆ పార్టీ శ్రేణులు ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజినీని శశికళ కలిసి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఈ సమావేశానికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం అందుతోంది. కేవలం వ్యక్తిగతంగానే శశికళ రజినీకాంత్ ను కలిసినట్లు చెబుతున్నారు. ఇటీవల రజినీకాంత్ అనారోగ్యానికి గురై శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు శశికళ రజినీకాంత్ ఇంటికి వెళ్లారని సమాచారం.

అలాగే ఇటీవల రజినీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రజనీకాంత్ ను శశికళ అభినందించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రెండేళ్లకు ముందు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కరోనా వ్యాప్తి, తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు ముందుగా రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ రజినీ కాంత్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

First Published:  7 Dec 2021 10:33 AM GMT
Next Story