Telugu Global
NEWS

తెలంగాణలో విద్యా సంస్థల మూతపై ప్రభుత్వం క్లారిటీ..!

తెలంగాణలోని పాఠశాలలు, గురుకులాల్లో ఇటీవల వరుసగా విద్యార్థులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. వారం కిందట సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో 40 మందికిపైగా విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇలా పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో తెలంగాణలో విద్యా సంస్థలను మూసి […]

తెలంగాణలో విద్యా సంస్థల మూతపై ప్రభుత్వం క్లారిటీ..!
X

తెలంగాణలోని పాఠశాలలు, గురుకులాల్లో ఇటీవల వరుసగా విద్యార్థులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. వారం కిందట సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో 40 మందికిపైగా విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

ఇలా పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో తెలంగాణలో విద్యా సంస్థలను మూసి వేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల మూసివేత పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పాఠశాలల మూసివేత పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు.

పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో అక్కడక్కడ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, వీటిపై ఆందోళన అవసరం లేదన్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని కోరారు.

కరోనా కారణంగా ఇప్పటికే విద్యార్థులు రెండేళ్ల విద్యా సంవత్సరాలను నష్టపోయారని, వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడకుండా విద్యాశాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. పాఠశాలల్లో పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ లో ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

First Published:  7 Dec 2021 10:43 AM GMT
Next Story