Telugu Global
National

భారత్ లో చిన్నారుల్లో పెరుగుతున్న రక్తహీనత..

భవిష్యత్ భారతానికి పెనుముప్పుగా మారే పరిణామం ఇది. బాల భారతం అనారోగ్యాల బారిన పడటానికి ప్రధాన కారణం ఇది. భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతున్నా, ఆహారంపై పెట్టే ఖర్చు పెరుగుతున్నా కూడా.. భారతీయ చిన్నారుల్లో రక్తహీనత పెరుగుతోంది. గతంలో కంటే దాదాపు 10శాతం మందిలో ఈ ముప్పు పెరిగిందని చెబుతున్నాయి సర్వేలు. జాతీయ కుటుంబ సర్వే-5 ప్రకారం చిన్నారుల ఆరోగ్యం విషయంలో వెలుగులోకి వచ్చిన గణాంకాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. భారత్ లో 6 నుంచి 59 నెలల […]

భారత్ లో చిన్నారుల్లో పెరుగుతున్న రక్తహీనత..
X

భవిష్యత్ భారతానికి పెనుముప్పుగా మారే పరిణామం ఇది. బాల భారతం అనారోగ్యాల బారిన పడటానికి ప్రధాన కారణం ఇది. భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతున్నా, ఆహారంపై పెట్టే ఖర్చు పెరుగుతున్నా కూడా.. భారతీయ చిన్నారుల్లో రక్తహీనత పెరుగుతోంది. గతంలో కంటే దాదాపు 10శాతం మందిలో ఈ ముప్పు పెరిగిందని చెబుతున్నాయి సర్వేలు. జాతీయ కుటుంబ సర్వే-5 ప్రకారం చిన్నారుల ఆరోగ్యం విషయంలో వెలుగులోకి వచ్చిన గణాంకాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి.

భారత్ లో 6 నుంచి 59 నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ సర్వే చెబుతోంది. పట్టణ ప్రాంతాల్లో 64.2 శాతం పిల్లల్లో రక్తహీనత ఉండగా, గ్రామీణ ప్రాంతాల చిన్నారుల్లో 68.3 శాతం మందిలో ఈ లోపం ఉంది. మొత్తంగా 67.1 శాతం మంది పిల్లలు దేశవ్యాప్తంగా రక్తహీనతతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ సర్వే-4 ప్రకారం రక్తహీనత ఉన్న పిల్లల శాతం 58.6 కాగా.. తాజా సర్వే ప్రకారం 67.1 శాతానికి ఆ సంఖ్య పెరిగింది. గుజరాత్ రాష్ట్రంలో చిన్నారులు అధిక సంఖ్యలో ఈ లోపంతో బాధపడుతున్నారు. 79.7 శాతం మంది గుజరాత్ లో రక్తహీనతతో బాధపడుతున్నారు. చత్తీస్ ఘడ్ లో గతంతో పోల్చి చూస్తే.. ఈ సమస్య తీవ్రత ఎక్కువగా పెరిగింది.

అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది..
గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు పౌష్టికాహారం సరిగా అందడంలేదు. అయితే పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. గర్భిణులకు పౌష్టికాహార లోపం వల్ల పిల్లల్లో కూడా అదే లోపం కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ లో రక్తహీనత బాధితుల సంఖ్య పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అత్యథిక అక్షరాశ్యత ఉన్న కేరళలో మాత్రం ఈ సమస్య చాలా తక్కువగా ఉండటం విశేషం. కేరళలో రక్తహీనత కేసుల సంఖ్య కేవలం 39.4 శాతం మాత్రమే.

Next Story