Telugu Global
Cinema & Entertainment

సిరివెన్నెల రాసిన చివరి పాట ఇదే

నాని హీరోగా నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి. డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన పాటను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ఈ పాట ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాని, రాహుల్ సంకృత్యాన్ వీడియో సందేశం ద్వారా […]

సిరివెన్నెల రాసిన చివరి పాట ఇదే
X

నాని హీరోగా నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి.

డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన పాటను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ఈ పాట ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాని, రాహుల్ సంకృత్యాన్ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.

రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ‘నవంబర్ 3న సిరివెన్నెలగారు కాల్ చేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతోన్నాను అని అన్నారు. ఎలాగైనా సరే పాటను పూర్తి చేయండని మేం ఎంతో రిక్వెస్ట్ చేశాం. ఆ తెల్లారే ఆయన ఫోన్ చేసి మమ్మల్ని నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. పల్లవి చెబుతాను రాసుకోండి అని అన్నారు. మహాభారతం బుక్‌పైన ఆరులైన్లు రాశాను.. అందులోని ఓ లైన్‌లో సిరివెన్నెల అని ఉంది. ఆయన నవ్వుతూ ఇదే నా చివరి పాట అవుతుందేమోనని అన్నారు. విధి అంటే ఇదేనేమో. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఆ పాటను రికార్డ్ చేశాం’ అని అన్నారు.

నాని మాట్లాడుతూ.. ‘సిరివెన్నెల అనే పాట ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే లెజెండ్ సిరివెన్నెల రాసిన చివరి పాట అది. ఆయన మరోపాటను కూడా రాశారు. దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తాం. శ్యామ్ సింగ రాయ్ సినిమాను సిరివెన్నెల గారికి అంకితం ఇస్తున్నాం’ అని అన్నారు.

‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

First Published:  5 Dec 2021 5:17 AM GMT
Next Story