Telugu Global
National

ఢిల్లీ వాహనాల నెంబర్ ప్లేట్ లో ఇక ఆ సిరీస్ కనిపించదు..

ఇటీవల ఢిల్లీలో టూవీలర్స్ నడిపే మహిళల్లో చాలామందికి ఎదురైన కామన్ ప్రాబ్లమ్ ఒకటి ఉంది. టూవీలర్ నెంబర్ ప్లేట్లలో SEX అనే సిరీస్ వల్ల యువతులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. బయట పోకిరీల కామెంట్స్ తో సతమతమవుతున్నారు. ఢిల్లీలో ఓ యువతికి ఆమె తండ్రి ఇటీవల పుట్టినరోజు కానుకగా ఓ స్కూటీ కొనిచ్చాడు. అయితే దానికి SEX అనే నెంబర్ సిరీస్ వచ్చింది. దీంతో తండ్రి షోరూమ్ నిర్వాహకుల్ని కలిసినా ఫలితం లేదు. ఆర్టీఏ ఆఫీస్ లో […]

ఢిల్లీ వాహనాల నెంబర్ ప్లేట్ లో ఇక ఆ సిరీస్ కనిపించదు..
X

ఇటీవల ఢిల్లీలో టూవీలర్స్ నడిపే మహిళల్లో చాలామందికి ఎదురైన కామన్ ప్రాబ్లమ్ ఒకటి ఉంది. టూవీలర్ నెంబర్ ప్లేట్లలో SEX అనే సిరీస్ వల్ల యువతులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. బయట పోకిరీల కామెంట్స్ తో సతమతమవుతున్నారు. ఢిల్లీలో ఓ యువతికి ఆమె తండ్రి ఇటీవల పుట్టినరోజు కానుకగా ఓ స్కూటీ కొనిచ్చాడు. అయితే దానికి SEX అనే నెంబర్ సిరీస్ వచ్చింది. దీంతో తండ్రి షోరూమ్ నిర్వాహకుల్ని కలిసినా ఫలితం లేదు. ఆర్టీఏ ఆఫీస్ లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో ఆ యువతి నేరుగా మహిళా కమిషన్ ని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కమిషన్.. ఇకపై ఆ నెంబర్ సిరీస్ ని ఎవరికీ కేటాయించొద్దంటూ రవాణాశాఖకు ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారంపై నాలుగు రోజుల్లోగా నివేదిక అందించాలని, గతంలో ఎవరెవరికి ఆ నెంబర్ సిరీస్ కేటాయించారనే వివరాలు కూడా తమకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది మహిళా కమిషన్.

ఎందుకీ SEX సిరీస్..
ఢిల్లీలో వాహనాల రిజిస్ట్రేషన్ DL అనే అక్షరాలతో మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే నెంబర్ ఢిల్లీలో ఆ వాహనానికి ఏ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేశారో తెలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ మూడు ఇంగ్లిష్ అక్షరాల సిరీస్ ఉంటుంది. ఉదాహరణకు DL 2 S AA 1234 అనే నెంబర్ సిరీస్ తో రిజిస్ట్రేషన్లు మొదలైతే. ఆ తర్వాత AA, AB, AC, ఇలా ఆ సిరీస్ లు కొనసాగుతాయి. మొదట్లో S కామన్ గా ఉంటుంది కాబట్టి.. SAA, SAB, SAC ఇలా నెంబర్లు కొనసాగేవి. అయితే ఆ సిరీస్ కాస్తా EX వరకు వచ్చే సరికి అర్థం మారిపోయింది. SEX సిరీస్ వచ్చేసింది. దీంతో టూవీలర్ల వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా యువతులు పోకిరీల కామెంట్లు తట్టుకోలేకపోతున్నారు.

కొన్నిరోజులుగా ఈ నెంబర్ ప్లేట్ సిరీస్ పై ఆందోళన జరుగుతున్నా ఆర్టీఏ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చాలామందికి ఇలాంటి నెంబర్లు ఇచ్చేశామని, వాటికి ప్రత్యామ్నాయం చూపలేమని చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు మహిళా కమిషన్ జోక్యం చేసుకునే సరికి రవాణా శాఖ కాస్త వెనక్కు తగ్గింది. నెంబర్ ప్లేట్ వ్యవహారంలో మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసిన ఆ యువతిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. మహిళా కమిషన్ చొరవకు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

First Published:  4 Dec 2021 9:59 PM GMT
Next Story