Telugu Global
Cinema & Entertainment

స్కైలాబ్ మూవీ రివ్యూ

న‌టీన‌టులు: నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు రచన- ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క్ కందెరావ్‌ విడుదల తేది : 4 డిసెంబర్ 2022 రేటింగ్: 2/5 ఈమధ్య పుష్పక విమానం అనే సినిమా వచ్చింది. ఫుల్లుగా నవ్వులు పూయిస్తుందని థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఈరోజు రిలీజైన స్కైలాబ్ సినిమాకు కూడా ఎదురైంది. […]

స్కైలాబ్ మూవీ రివ్యూ
X

న‌టీన‌టులు: నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి
నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
రచన- ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క్ కందెరావ్‌
విడుదల తేది : 4 డిసెంబర్ 2022
రేటింగ్: 2/5

ఈమధ్య పుష్పక విమానం అనే సినిమా వచ్చింది. ఫుల్లుగా నవ్వులు పూయిస్తుందని థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఈరోజు రిలీజైన స్కైలాబ్ సినిమాకు కూడా ఎదురైంది. కొన్ని సినిమాలపై ప్రేక్షకులు కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోతే, కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ తిరస్కరిస్తారు. స్కైలాబ్ సినిమాలో పుష్కలంగా ఫన్ ఉంటుందని ఆశించారు ప్రేక్షకులు. కానీ కథలో ఇంకోటి ఉంది. దీంతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేదు, ఫలితంగా రిజల్ట్ తేడా కొట్టేసింది.

ముందుగా కథ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఎందుకిలా జరిగిందో చెప్పుకోవడానికి బాగుంటుంది. 1979లో తెలంగాణాలోని బండలింగంపల్లి లో జరిగే కథ ఇది. ఆ ఊళ్ళో జమీందార్ వంశానికి చెందిన గౌరీ (నిత్యా మీనన్) హైదరాబాద్ లో ప్రతిబింబం అనే పత్రికలో పనిచేస్తూ ఓ సందర్భంలో ఊరి నుండి ఉత్తరం రావడంతో బండలింగంపల్లిలో అడుగుపెడుతుంది. అలాగే హైదరాబాద్ లో డాక్టర్ గా సస్పెండ్ అయి లైసెన్స్ రద్దవ్వడంతో ఊరికి వచ్చిన ఆనంద్(సత్య దేవ్) 5వేల రూపాయిల కోసం తాతని కాకా పడుతుంటాడు. అదే ఊరిలో పెద్ద వంశానికి చెందిన సుబేదారి రామారావు (రాహుల్ రామకృష్ణ) తన అప్పులు తీరే మార్గం కోసం ఎదురుచూస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఊరికి వచ్చిన గౌరీకి తన రచనలు నచ్చక ఉద్యోగం నుండి తీసేసిన విషయం తెలుస్తుంది. అక్కడి నుండి ఆమె ఓ కథనం రాసి రచయితగా నిరూపించుకోవాలని చూస్తోంది. కావాలనుకున్న డబ్బు దొరక్కపోవడంతో రామారావు తో కలిసి ఊళ్ళో ఓ క్లినిక్ పెట్టి సెటిల్ అవ్వాలని చూస్తుంటాడు ఆనంద్. అదే టైమ్ లో అమెరికా ప్రయోగించిన స్పేస్ షటిల్ స్కై లాబ్, తమ ఊరిపై పడబోతోందనే పుకార్లతో ఊరి జనం ఎలాంటి ఆందోళన చెందారు? చివరికి స్కైలాబ్ ముప్పు నుండి తప్పించుకొని ఎలా తమ జీవితాలను తిరిగి కొనసాగించారనేది మిగతా కథ.

స్కైలాబ్ కూలిన సమయంలో ఎన్నో వింతలు జరిగాయి, మరెన్నో సరదా సంఘటనలు కూడా జరిగాయి. అవన్నీ అప్పటి దినపత్రికల్లో కూడా వచ్చాయి. ఇప్పటి జనాలకు తెలిసింది కూడా అదే. సో.. ఈ స్కైలాబ్ మూవీలో అప్పటి ఫన్నీ సీన్స్ అన్నీ రీక్రియేట్ చేసి ఉంటారని ప్రేక్షకులు ఆశించారు. కానీ సినిమాలో కామెడీ లేదు, పెట్టిన కామెడీ పండలేదు. పోనీ కామెడీ సంగతి వదిలేద్దాం, కనీసం స్కైలాబ్ కూలుతుందనే విషయం తెలిసిన తర్వాత గ్రామస్తుల్లో ఉన్న భయం, ఆందోళన లాంటి ఎమోషన్స్ ను కూడా సినిమాలో చూపించలేకపోయారు. దీంతో స్కైలాబ్ రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.

నిజానికి ఈ ఓటీటీలో కాలంలో మంచి కథ వండడానికి ఇదొక అద్భుతమైన ముడిసరకు. కానీ ఈ ముడిసరుకును ఎలా వండాలో తెలియక కొత్త దర్శకుడు విశ్వక్ కందెరావ్ తప్పటడుగులు వేశాడు. ఉప్పు, మసాలా, కారం లేకుండా సినిమాను చప్పగా వండాడు. ఇదే ముడిసరుకుతో మంచి టీమ్ తో కూర్చొని ఉంటే బెటర్ ఔట్ పుట్ వచ్చేది. కనీసం మంచి ఓటీటీ స్టఫ్ గా అయినా నిలబడేది. కానీ ఈరోజు థియేటర్లలోకొచ్చిన స్కైలాబ్ మాత్రం ఇటు థియేటర్ కు, అటు ఓటీటీకి కూడా పనికిరాని స్టఫ్ గా మారింది.

చెప్పుకోడానికి మంచి నటీనటులున్నారు. ఉత్తమ నటి నిత్యామీనన్ వృధా అనిపించుకుంది. ప్రామిసింగ్ యాక్టర్ సత్యదేవ్ కు నటించడానికి ఛాన్స్ లేదు. కామెడీ టైమింగ్ లో దిట్ట రాహుల్ రామకృష్ణకు చేతులు కట్టేశారు. ఇలాంటి తప్పులన్నీ జరగడానికి కారణం స్క్రిప్ట్ దశలో సరిగ్గా చూసుకోకపోవడమే. లీడ్ రోల్స్ పరిస్థితే ఇలా ఉందంటే.. క్యారెక్టర్ రోల్స్ చేసిన తులసి, తనికెళ్ల లాంటి ఆర్టిస్టుల పరిస్థితి ఊహించుకుంటేనే జాలేస్తుంది. టెక్నికల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

ఓవరాల్ గా స్కైలాబ్ సినిమా ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని ఇవ్వదు. ఇటు కామెడీ పండించక, అటు ఎమోషన్ అందించక మధ్యలోనే కుప్పకూలిపోయింది.

First Published:  4 Dec 2021 5:15 AM GMT
Next Story