Telugu Global
NEWS

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒక్కరోజులో ఏడుగురు విదేశీ ప్రయాణికులకు పాజిటివ్..!

తెలంగాణ రాష్ట్రాన్ని ఒమిక్రాన్ భయం వణికిస్తోంది. బెంగళూరులో ఇప్పటికే ఒమిక్రాన్ బెంబేలిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నగరంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, వారితో సన్నిహితంగా మెలిగిన మరో ఐదుగురికి పాజిటివ్ రావడం కలకలం రేపింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్ట్ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో హైదరాబాద్ లో ఎప్పుడు ఈ వైరస్ ఎంటర్ అవుతుందోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన […]

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒక్కరోజులో ఏడుగురు విదేశీ ప్రయాణికులకు పాజిటివ్..!
X

తెలంగాణ రాష్ట్రాన్ని ఒమిక్రాన్ భయం వణికిస్తోంది. బెంగళూరులో ఇప్పటికే ఒమిక్రాన్ బెంబేలిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నగరంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, వారితో సన్నిహితంగా మెలిగిన మరో ఐదుగురికి పాజిటివ్ రావడం కలకలం రేపింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్ట్ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో హైదరాబాద్ లో ఎప్పుడు ఈ వైరస్ ఎంటర్ అవుతుందోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

విదేశాల నుంచి వచ్చిన వారికి ప్రస్తుతం ఎయిర్ పోర్టులో కరోనా టెస్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పలు దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కలగజేస్తోంది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ ఒకే రోజు ఏడుగురికి వైరస్ సోకింది లేదు. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

వైరస్ సోకిన అందరినీ అధికారులు నగరంలోని టిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం టిమ్స్ లో మొత్తం 12 మంది విదేశీ ప్రయాణికులు కరోనాతో చికిత్స పొందుతున్నారు. వీరిలో యూకే నుంచి వచ్చిన వారిలో తొమ్మిది మంది, సింగపూర్ నుంచి ఒకరు, కెనడా నుంచి ఒకరు, అమెరికా నుంచి వచ్చిన మరొక ప్రయాణికుడు ఉన్నాడు.

వీరందరి దగ్గర శాంపిల్స్ సేకరించి జినోమ్ సీకెన్స్ కి పంపారు. వీరిలో ఏ ఒక్కరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినా మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు.

First Published:  3 Dec 2021 9:38 AM GMT
Next Story