Telugu Global
NEWS

తెలంగాణలో మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా..

ఒమిక్రాన్ హెచ్చరికలు, థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మాస్క్ ధరించడానికి సంబంధించి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా వసూలు చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికే అనుమతి.. ఆఫీస్ లు, బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారు తప్పనిసరిగా […]

తెలంగాణలో మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా..
X

ఒమిక్రాన్ హెచ్చరికలు, థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మాస్క్ ధరించడానికి సంబంధించి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా వసూలు చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వ్యాక్సిన్ వేసుకున్నవారికే అనుమతి..
ఆఫీస్ లు, బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు తెలంగాణ అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో నేటినుంచి వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ని కూడా అధికారులు వెరిఫై చేస్తారని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 90శాతం మందికి తొలి డోసు పూర్తి కాగా.. 47శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 25లక్షల కొవిడ్ వ్యాక్సిన్ అందబాటులో ఉన్నట్టు చెప్పారు.

విదేశాలనుంచి వచ్చినవారికి కరోనా..
విదేశాలనుంచి వచ్చినవారందరికీ ఎయిర్ పోర్టుల్లోనే కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని, అతడిని టిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు అధికారులు. అతడి శ్వాబ్ నమూనాలను జీనోమ్ ల్యాబ్ కి పంపించామని తెలిపారు. ఫలితాలు వచ్చిన తర్వాత అది ఒమిక్రాన్ వేరియంటా కాదా అనేది నిర్థారిస్తామని చెప్పారు.

సీఎం అధ్యక్షతన సమీక్ష..
ఒమిక్రాన్ వ్యాప్తి భయాలు ముసురుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు అధికారులు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందని, ఈరోజు నిబంధనలు పాటించకపోతే.. థర్డ్ వేవ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అవాస్తవాలే నిజం అయ్యే రోజులు వస్తాయని హెచ్చరించారు.

First Published:  2 Dec 2021 8:44 AM GMT
Next Story