Telugu Global
Health & Life Style

చాపకింద నీరులా డెంగీ.. ఏపీలో భారీగా పెరిగిన కేసులు..

కొవిడ్ నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్న అధికార యంత్రాంగం డెంగీ కేసులపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేకపోతోంది. ఫలితంగా ఏపీలో డెంగీ కేసులు భారీగా పెరిగిపోయాయి. నియంత్రణ చర్యలు, ప్రజలకు అగాహన లేకపోవడం, సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో డెంగీ కేసులు, బాధితులు భారీగా పెరిగిపోయారు. గతేడాది మొత్తం ఏపీలో 925 డెంగీ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది నవంబర్ 21 వరకు తేలిన లెక్క 3900. అంటే దాదాపుగా 69శాతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇది […]

చాపకింద నీరులా డెంగీ.. ఏపీలో భారీగా పెరిగిన కేసులు..
X

కొవిడ్ నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్న అధికార యంత్రాంగం డెంగీ కేసులపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేకపోతోంది. ఫలితంగా ఏపీలో డెంగీ కేసులు భారీగా పెరిగిపోయాయి. నియంత్రణ చర్యలు, ప్రజలకు అగాహన లేకపోవడం, సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో డెంగీ కేసులు, బాధితులు భారీగా పెరిగిపోయారు. గతేడాది మొత్తం ఏపీలో 925 డెంగీ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది నవంబర్ 21 వరకు తేలిన లెక్క 3900. అంటే దాదాపుగా 69శాతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇది ప్రమాదకర స్థితి అని అంటున్నారు వైద్య నిపుణులు.

దోమలకు అనుకూల వాతావరణం..
ఈ ఏడాది ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దోమల తాకిడి ఎక్కువగా ఉందని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలపై దృష్టిపెట్టకపోవడం వల్లే దోమల సంతతి పెరుగుతోందని, తద్వారా డెంగీ లాంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముందు జాగ్రత్తలతోనే డెంగీ కేసుల్ని నివారించ వచ్చని అంటున్నారు.

2018-19లోనే అధికం..
గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది డెంగీ కేసులు అధికంగానే ఉన్నా.. 2018, 2019లో అంతకంటే ఎక్కువ కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2018లో 4,011 కేసులు నమోదు కాగా.. 2019లో ఏపీలో డెంగీ కేసుల సంఖ్య 5,286. అయితే 2020లో మాత్రం కేసులు భారీగా తగ్గాయి, ఈ ఏడాది ఇప్పటి వరకు భారీగా పెరిగాయి.

మలేరియా తగ్గుముఖం..
డెంగీ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తున్నా.. మలేరియా కేసులు తగ్గుముఖం పట్టడం విశేషం. గతేడాదికంటే వెయ్యి మలేరియా కేసులు ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి. మొత్తమ్మీద ఈ ఏడాది డెంగీ కేసుల సంఖ్య భారీగా పెరిగినా.. డెంగీ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం విశేషం. అధికారిక లెక్కల్లో డెంగీ మరణాలు లేవు. అయితే ఆస్పత్రి ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు డెంగీ కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

First Published:  30 Nov 2021 11:12 PM GMT
Next Story