Telugu Global
National

కేరళలో కొవిడ్ వైద్యం ఉచితం కాదు.. ప్రభుత్వ సంచలన నిర్ణయం..

కొవిడ్ లక్షణాలున్నవారికి ఉచితంగా క్వారంటైన్ సెంటర్లను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైనవారికి వైద్యాన్ని కూడా ఉచితంగానే అందించాయి. వేల రూపాయలు ఖర్చయ్యే అత్యవసర మందుల్ని కూడా ఉచితంగా రోగులకు సమకూర్చాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ వార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ సేవలందించారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలున్న రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఉచితంగానే ట్రీట్ మెంట్ ఇచ్చారు. అయితే ఇకపై ఇలాంటి ఉచిత వైద్యం కేరళలో అందుబాటులో ఉండదని కరాఖండిగా చెప్పేశారు సీఎం పినరయి విజయన్. […]

కేరళలో కొవిడ్ వైద్యం ఉచితం కాదు.. ప్రభుత్వ సంచలన నిర్ణయం..
X

కొవిడ్ లక్షణాలున్నవారికి ఉచితంగా క్వారంటైన్ సెంటర్లను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైనవారికి వైద్యాన్ని కూడా ఉచితంగానే అందించాయి. వేల రూపాయలు ఖర్చయ్యే అత్యవసర మందుల్ని కూడా ఉచితంగా రోగులకు సమకూర్చాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ వార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ సేవలందించారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలున్న రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఉచితంగానే ట్రీట్ మెంట్ ఇచ్చారు. అయితే ఇకపై ఇలాంటి ఉచిత వైద్యం కేరళలో అందుబాటులో ఉండదని కరాఖండిగా చెప్పేశారు సీఎం పినరయి విజయన్. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

వ్యాక్సిన్ తీసుకోకపోతే ఉచిత వైద్యం లేదు..
ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేపడుతున్నా.. కొంతమంది టీకాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటివారి వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్న కేరళ సర్కారు.. ఉద్దేశపూర్వకంగా వ్యాక్సిన్ తీసుకోనివారికి ఉచిత వైద్యం చేయబోమని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకోనివారు కొవిడ్ బారిన పడితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ దీర్ఘ కాలిక వ్యాధులు, ఇతరత్రా సమస్యలతో వ్యాక్సిన్ తీసుకోకపోతే వైద్యులనుంచి ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల్లో కూడా వ్యాక్సిన్ తీసుకోనివారు దానికి సరైన కారణం చెప్పాలనే నిబంధన తెరపైకి తెచ్చారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోకుండా విధులకు హాజరయ్యే ఉద్యోగులు వారానికోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం కూడా తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మొత్తమ్మీద వ్యాక్సిన్ కి వెనకడుగు వేస్తున్నవారిపట్ల కఠినంగా వ్యవహరించాలనుకుంటోంది కేరళ ప్రభుత్వం.

కర్నాటకలో రేషన్ కట్..!
కర్నాటకలో వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పెన్షన్.. ఇతర ప్రభుత్వ పథకాలు అందుబాటులో లేకుండా చేయాలని కర్నాటక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం తరపున అందించే సౌకర్యాలను తొలగిస్తామని హెచ్చరిస్తే కనీసం కొంతమంది అయినా వ్యాక్సిన్ కోసం త్వరపడతారని అంచనా వేస్తోంది కర్నాటక ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో 41 లక్షలమంది ఇంకా సెకండ్ డోస్ వేయించుకోలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పై దృష్టిసారించాయి.

First Published:  30 Nov 2021 11:24 PM GMT
Next Story