Telugu Global
National

వారసత్వం కంటే నియంతృత్వమే చెడ్డది.. బీజేపీకి శివసేన కౌంటర్..

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు, అవి అభివృద్ధి నిరోధకాలంటూ ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇతర పార్టీల్లో ఉన్న వారసత్వం కంటే బీజేపీలో ఉన్న నియంతృత్వమే అన్నిటికంటే చెడ్డదని సామ్నా పత్రికలో ప్రధాని మోదీని టార్గెట్ చేసింది శివసేన. కాంగ్రెస్ పార్టీ తమకు ప్రత్యామ్యాయం కాదని అంటున్న బీజేపీ.. ఇంకా ఆ పార్టీని చూసి భయపడుతోందని, అందుకే పదే పదే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ మోదీ విమర్శలు చేస్తున్నారంటూ […]

వారసత్వం కంటే నియంతృత్వమే చెడ్డది.. బీజేపీకి శివసేన కౌంటర్..
X

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు, అవి అభివృద్ధి నిరోధకాలంటూ ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇతర పార్టీల్లో ఉన్న వారసత్వం కంటే బీజేపీలో ఉన్న నియంతృత్వమే అన్నిటికంటే చెడ్డదని సామ్నా పత్రికలో ప్రధాని మోదీని టార్గెట్ చేసింది శివసేన. కాంగ్రెస్ పార్టీ తమకు ప్రత్యామ్యాయం కాదని అంటున్న బీజేపీ.. ఇంకా ఆ పార్టీని చూసి భయపడుతోందని, అందుకే పదే పదే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ మోదీ విమర్శలు చేస్తున్నారంటూ మండిపడింది శివసేన.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా వారసులకే పార్టీ పగ్గాలు అప్పగించే వారు.. భారత ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడగలరు అంటూ ఇటీవల ప్రధాని మోదీ వారసత్వ పార్టీలపై చెణుకులు విసిరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ సహా.. వారసత్వ రాజకీయాలు చేసే అన్ని పార్టీలను ఆయన టార్గెట్ చేశారు. దీనిపై తాజాగా శివసేన తీవ్ర స్థాయిలో స్పందించింది. బీజేపీలో వారసత్వం లేకపోయినా.. నియంతృత్వం ఉందని, మోదీ బొటనవేలు కింద ఉన్నవారే ఆ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని, అలాంటి వ్యవస్థను ఆయన తయారు చేసుకున్నారని విమర్శలు చేసింది.

డెమొక్రటిక్ – ఆటోమేటిక్
మోదీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్ కి చెందినవారే బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో నిర్ణయిస్తున్నారని, ఈ రకమైన నియంతృత్వానికి బీజేపీ పెట్టింది పేరని అంటున్నారు శివసేన నేతలు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు దాన్ని కొనసాగించేందుకు ఆటోమేటిక్ పద్ధతిని ఎంచుకుందని విమర్శించారు. మిగతా పార్టీల పగ్గాలు వారసుల చేతిలో ఉంటే, బీజేపీ పగ్గాలు మాత్రం మోదీ ఎంపిక చేసినవారి చేతిలోనే ఉంటాయని అన్నారు. శివసేన విమర్శలు హాట్ హాట్ గానే ఉన్నా.. బీజేపీ మాత్రం ఆ వ్యవహారంపై స్పందించలేదు. సామ్నాలో వచ్చే కథనాలపై స్పందించకూడదని మహారాష్ట్ర బీజేపీ గతంలో ఓ నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రధానిపై విమర్శలు చేసినా కూడా ఆ రాష్ట్ర బీజేపీ శాఖ మాత్రం సైలెంట్ గా ఉంది.

First Published:  29 Nov 2021 9:51 PM GMT
Next Story