Telugu Global
National

ఢిల్లీలో సడలని నిబంధనలు.. కార్మికులకు రూ.5వేలు..

సుప్రీంకోర్టు చీవాట్ల తర్వాత ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అప్పటి వరకూ వ్యవసాయ వ్యర్థాలపై వంక పెట్టుకున్నా.. ఇప్పుడు నగరంలో కాలుష్య కారకాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. దాదాపు రెండు వారాల తర్వాత ఢిల్లీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. అయితే కాలుష్య తీవ్రతలో ఏమాత్రం తేడా లేదనే విషయం మాత్రం కలవరపెడుతోంది. దీంతో ఢిల్లీలోకి వచ్చే సరకు రవాణా వాహనాలపై డిసెంబర్ 7 వరకు నిషేధం […]

ఢిల్లీలో సడలని నిబంధనలు.. కార్మికులకు రూ.5వేలు..
X

సుప్రీంకోర్టు చీవాట్ల తర్వాత ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అప్పటి వరకూ వ్యవసాయ వ్యర్థాలపై వంక పెట్టుకున్నా.. ఇప్పుడు నగరంలో కాలుష్య కారకాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. దాదాపు రెండు వారాల తర్వాత ఢిల్లీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. అయితే కాలుష్య తీవ్రతలో ఏమాత్రం తేడా లేదనే విషయం మాత్రం కలవరపెడుతోంది. దీంతో ఢిల్లీలోకి వచ్చే సరకు రవాణా వాహనాలపై డిసెంబర్ 7 వరకు నిషేధం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వినియోగ సరకుల వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం అనుమతి ఉంది.

ఢిల్లీలో ఎక్కడైన అనుమతి లేకుండా భారీ వాహనాలు కనిపించినా, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెట్టినా, నిర్మాణ పనులు చేపట్టినా గ్రీన్ ఢిల్లీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటి వరకూ అధికారులు 8480 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వెయ్యిచోట్ల నిబంధనలు పాటించడంలేదనే కారణంతో జరిమానాలు విధించారు. 28.76లక్షల రూపాయలు జరిమానా రూపంలో సేకరించారు. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకపోవడంతో 14వేలమంది వాహనదారుల నుంచి జరిమానా వసూలు చేశారు. ఇంత జరుగుతున్నా ఢిల్లీలో కాలుష్యం ఇంకా నియంత్రణలోకి రాకపోవడం విశేషం. గత ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 405గా నమోదైంది. ఇది తీవ్రమైన సంకేతం అని అంటున్నారు నిపుణులు.

కార్మికులకు రూ.5వేలు ఆర్థిక సాయం..
భవన నిర్మాణ పనులపై నిషేధం కొనసాగిస్తుండటంతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఒక్కో కార్మికుడికి 5వేల రూపాయల పరిహారం ఇస్తోంది. ఇంటీరియర్ డెకరేషన్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనుల్ని యధావిధిగా కొనసాగించుకునేలా వెసులుబాటు ఇచ్చింది. కేవలం నిర్మాణాలపై మాత్రమే నిషేధం కొనసాగుతోంది. మరోవైపు కొన్ని కాలనీలకు ప్రభుత్వమే బస్సు సర్వీసులను అదనంగా నడుపుతోంది. ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు పక్కనపెట్టి ప్రజా రవాణాను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది. కాలుష్యం పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వచ్చే వరకు నిబంధనలు కఠినంగా అమలు చేస్తామంటున్నారు అధికారులు. అప్పటి వరకు ఇబ్బందులు ఎదురైనా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

First Published:  29 Nov 2021 10:05 PM GMT
Next Story