Telugu Global
Cinema & Entertainment

ఏపీలో టికెట్ రేట్లపై సురేష్ బాబు నిరసన

ఆంధ్రప్రదేశ్ థియేటర్లలో టికెట్ రేట్లపై నిర్మాత సురేష్ బాబు మరోసారి స్పందించారు. బహిరంగంగా తన నిరసనను తెలియజేశారు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండడం వల్లనే దృశ్యం-2 సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చిందంటున్నారు సురేష్ బాబు. ఈ 15 నెలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టాలీవుడ్ కు చేసిందేం లేదన్నారు. “ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే […]

ఏపీలో టికెట్ రేట్లపై సురేష్ బాబు నిరసన
X

ఆంధ్రప్రదేశ్ థియేటర్లలో టికెట్ రేట్లపై నిర్మాత సురేష్ బాబు మరోసారి స్పందించారు. బహిరంగంగా తన నిరసనను తెలియజేశారు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండడం వల్లనే దృశ్యం-2 సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చిందంటున్నారు సురేష్ బాబు. ఈ 15 నెలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టాలీవుడ్ కు చేసిందేం లేదన్నారు.

“ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 ఉంది. అది చాలా నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు. ఈ కారణాల వల్ల దృశ్యం 2 సినిమాను థియేటర్లకు ఇవ్వలేదు. ఇది ఓటీటీలో అయితే బాగుంటుందని అనుకున్నాం. ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరుగుతుంది అనిపిస్తుంది. మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమనేది కూడా కరెక్ట్ కాదు. ఓ ప్రొడక్ట్‌‌ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలలో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.”

ఇలా తన అసంతృప్తిని బాహాటంగానే తెలియజేశారు సురేష్ బాబు. దృశ్యం-2 సినిమాను ఓటీటీలో సూపర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన ఈ నిర్మాత.. త్వరలోనే మోహన్ లాల్ నటించిన మరక్కార్ అనే డబ్బింగ్ సినిమాతో థియేటర్లలోకి వస్తామంటున్నారు.

First Published:  28 Nov 2021 6:27 AM GMT
Next Story