Telugu Global
International

థర్డ్ వేవ్ కి దక్షిణాఫ్రికా టార్గెట్ అవుతుందా..?

కరోనా వ్యాప్తి చైనానుంచి మొదలైందనే విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ వేవ్ నింద చైనాపై పడగా.. ఆ తర్వాత సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో భారత్ ని ప్రపంచ దేశాలు టార్గెట్ చేయాలని చూశాయి. ఓ దశలో భారత్ వేరియంట్ అనే ప్రచారం కూడా మొదలైంది. అయితే చివరికి దాన్ని డెల్టా వేరియంట్ గా తేల్చారు. ఇప్పుడు థర్డ్ వేవ్ మొదలైందా, లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అదిగో విజృంభణ, ఇదిగో విజృంభణ […]

థర్డ్ వేవ్ కి దక్షిణాఫ్రికా టార్గెట్ అవుతుందా..?
X

కరోనా వ్యాప్తి చైనానుంచి మొదలైందనే విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ వేవ్ నింద చైనాపై పడగా.. ఆ తర్వాత సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో భారత్ ని ప్రపంచ దేశాలు టార్గెట్ చేయాలని చూశాయి. ఓ దశలో భారత్ వేరియంట్ అనే ప్రచారం కూడా మొదలైంది. అయితే చివరికి దాన్ని డెల్టా వేరియంట్ గా తేల్చారు. ఇప్పుడు థర్డ్ వేవ్ మొదలైందా, లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అదిగో విజృంభణ, ఇదిగో విజృంభణ అంటూ రకరకాల వేరియంట్ల పేర్లు కూడా బయటకొచ్చాయి. కానీ డెల్టా లాగా అన్ని దేశాలు ఒకేసారి ప్రభావానికి లోనైన దాఖలాలు లేవు. కొన్ని దేశాల్లో కేసులు పెరుగుతూ, తగ్గుతూ వచ్చాయి. మొత్తంగా నెలరోజుల ముందు వరకూ ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కానీ ఇప్పుడు ‘ఒమిక్రాన్’ అనే వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికా అత్యథికంగా ప్రభావితం అవుతోంది. ఒకరకంగా ఈ వేరియంట్ వ్యాప్తికి దక్షిణాఫ్రికాయే కారణం అంటూ.. అన్ని దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించాయి.

అత్యంత ఆందోళనకర రకం
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దక్షిణాఫ్రికాలో 100కు పైగా చేరుకున్నాయి. ఇది బీటా, డెల్టా కంటే ప్రమాదకరమైనదని అంటున్నారు. ఇప్పటికే దీన్ని ఆందోళనకరమైన వేరియంట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది. కొత్త వేరియంట్‌ కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రకటించింది కూడా.

ఆంక్షలతో గందరగోళం..
దక్షిణాఫ్రికా సహా మొత్తం 6 దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్‌ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌ కూడా దక్షిణాఫ్రికాపై ట్రావెల్ బ్యాన్ పెట్టింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, జపాన్‌ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు అంగీకరించాయి. డిసెంబర్-15 నుంచి అన్ని అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్ కూడా ‘ఒమిక్రాన్’ దెబ్బకి వెనకడుగు వేసింది. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్సువానా, చైనా, మారిషస్.. దేశాలనుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది.

భారత్‌ లో ప్రస్తుతం ‘ఒమిక్రాన్’ లేనట్టే..
కొత్త వేరియంట్‌ కు సంబంధించి దేశంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని ఇండియన్‌ సార్స్‌-కొవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సా కాగ్‌) వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించింది. కొత్త వేరియంట్‌ ను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది.

First Published:  26 Nov 2021 9:05 PM GMT
Next Story