Telugu Global
National

యూపీలో వలస రాజకీయం కలిసొస్తుందా..?

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో ఉత్తర ప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. యూపీ ఎన్నికల్లో ఓటమి భయం ఉండటం వల్లే.. కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకుందనే విమర్శలు కూడా ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ఉచిత రేషన్ ని పొడిగించడం లాంటి తాయిలాలన్నీ యూపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నవే. సీఎం యోగి ఆదిత్యనాథ్ పై పూర్తి స్థాయిలో నమ్మకం లేకపోవడంతో ఆమధ్య కేబినెట్ లోకి కొత్త మొహాలను చేర్చించి […]

యూపీలో వలస రాజకీయం కలిసొస్తుందా..?
X

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో ఉత్తర ప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. యూపీ ఎన్నికల్లో ఓటమి భయం ఉండటం వల్లే.. కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకుందనే విమర్శలు కూడా ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ఉచిత రేషన్ ని పొడిగించడం లాంటి తాయిలాలన్నీ యూపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నవే. సీఎం యోగి ఆదిత్యనాథ్ పై పూర్తి స్థాయిలో నమ్మకం లేకపోవడంతో ఆమధ్య కేబినెట్ లోకి కొత్త మొహాలను చేర్చించి అధిష్టానం. తాజాగా.. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ వలస రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలకు కాషాయ కండువాలు కప్పేస్తోంది.

రాయ్ బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితిసింగ్, అజాంఘర్ బీఎస్పీ ఎమ్మెల్యే వందన సింగ్ ఒకేరోజు బీజేపీలో చేరారు. విశేషం ఏంటంటే.. రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గానికి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. ఇక అజాంఘర్ లోక్ సభ నియోజకవర్గానికి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఎంపీ గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలపై పట్టు పెంచుకునేందుకు ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బీజేపీ గాలమేసింది.

403 స్థానాల యూపీ అసెంబ్లీలో బీజేపీ 309 స్థానాలతో పటిష్టంగా ఉంది. కానీ యోగి పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు సర్వేలు చెబుతున్నాయి. దాదాపుగా 15 ఏళ్లపాటు ఎస్పీ, బీఎస్పీ మధ్యే అధికార పంపకాలు జరగగా.. దానికి యోగి గండి కొట్టడంతో ఎంపీగా ఉన్న ఆయన్ను తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు మోదీ. అయితే మతపరమైన విధానాలతో ఆయనపై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. దీంతో ఓ దశలో సీఎం మార్పు వార్తలొచ్చినా అది కేబినెట్ మార్పుకే పరిమితమైంది. ఈ సారి కూడా యోగి ఆధ్వర్యంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లబోతోంది.

వలసలు కలిసొస్తాయా..?
ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో వలసలతో తృణమూల్ కాంగ్రెస్ ని నిర్వీర్యం చేశామని జబ్బలు చరుచుకుంది బీజేపీ. అయితే అలా వలస వచ్చినవారి వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని చివరిగా తేలింది. టీఎంసీనుంచి బీజేపీలో చేరి గెలిచిన నేతలంతా మళ్లీ మమత గూటికే క్యూ కడుతున్నారు. ఇప్పుడు యూపీలో కూడా ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ వలసలను ప్రోత్సహిస్తోంది బీజేపీ. మరి ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Next Story