Telugu Global
NEWS

బిగ్ రిలీఫ్ : రూ. 50కి పడిన కిలో టమోటా ధర..!

వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో టమోటా ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా కిలో టమోటా ధర రూ. వందకు పైగానే ఉంది.రెండు రోజుల కిందట కిలో టమోటాల ద్వారా గరిష్ఠంగా రూ. 130కి చేరింది. తమిళనాడు రాష్ట్రంలో అయితే రూ.150 పలికింది. దీంతో సామాన్య ప్రజలు వంటింట్లో టమోటా వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. టమోటా వాడకం లేని ప్రత్యామ్నాయ వంటలపై దృష్టి పెట్టారు. వారందరికీ ఇప్పుడు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇవాళ కిలో […]

బిగ్ రిలీఫ్ : రూ. 50కి పడిన కిలో టమోటా ధర..!
X

వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో టమోటా ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా కిలో టమోటా ధర రూ. వందకు పైగానే ఉంది.రెండు రోజుల కిందట కిలో టమోటాల ద్వారా గరిష్ఠంగా రూ. 130కి చేరింది. తమిళనాడు రాష్ట్రంలో అయితే రూ.150 పలికింది. దీంతో సామాన్య ప్రజలు వంటింట్లో టమోటా వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. టమోటా వాడకం లేని ప్రత్యామ్నాయ వంటలపై దృష్టి పెట్టారు. వారందరికీ ఇప్పుడు బిగ్ రిలీఫ్ దక్కింది.

ఇవాళ కిలో టమోటాల ధర రూ.50కి పడిపోయింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లె. ఇక్కడి నుంచే టమోటాలు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. చిత్తూరు, కడప, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా టమోటాలను పండిస్తారు. ఆ టమోటాలను మదనపల్లె మార్కెట్ కు తరలిస్తారు.

ఇవాళ మదనపల్లెలో పది కేజీల టమోటా బాక్స్ ధర రూ.450 వరకు పలికింది. అంటే దాదాపు కిలో టమోటా ధర రూ.50 గా ఉంది.వర్షం కాస్త తగ్గడం, రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడం, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి టమోటాల దిగుమతులు పెరగడంతో టమోటాల ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా రేపటి నుంచి మళ్లీ ఐదు రోజుల పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వర్షాలు పడి టమోటా పళ్ళు మళ్లీ దెబ్బతింటే రేట్లు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ లోగా టమోటాలు కొనుగోలుపై చాలా మంది దృష్టి పెట్టారు.

First Published:  25 Nov 2021 1:54 AM GMT
Next Story