Telugu Global
National

భారత్ లో మందుబాబులే వ్యాక్సిన్ కి బ్రాండ్ అంబాసిడర్లు..

రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకుంటేనే మా రెస్టారెంట్ లోకి ఎంట్రీ, కరోనా టీకా తీసుకున్నవారినే తిరిగి విధుల్లోకి తీసుకుంటాం.. ఇలాంటి నియమ నిబంధనలు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. భారత్ లో కూడా అక్కడక్కడా ఇలాంటి కండిషన్లు ఉన్నా కూడా.. ఏదీ ఎక్కడా పక్కాగా అమలవుతున్న దాఖలాలు లేవు. మాస్క్ లేకపోయినా ఇక్కడ చల్తా హై. కానీ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకంగా మందు బాబుల్నే వ్యాక్సినేషన్ ప్రచారానికి పరోక్షంగా ఉపయోగించుకోవడం విచిత్రం. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి […]

భారత్ లో మందుబాబులే వ్యాక్సిన్ కి బ్రాండ్ అంబాసిడర్లు..
X

రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకుంటేనే మా రెస్టారెంట్ లోకి ఎంట్రీ, కరోనా టీకా తీసుకున్నవారినే తిరిగి విధుల్లోకి తీసుకుంటాం.. ఇలాంటి నియమ నిబంధనలు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. భారత్ లో కూడా అక్కడక్కడా ఇలాంటి కండిషన్లు ఉన్నా కూడా.. ఏదీ ఎక్కడా పక్కాగా అమలవుతున్న దాఖలాలు లేవు. మాస్క్ లేకపోయినా ఇక్కడ చల్తా హై. కానీ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకంగా మందు బాబుల్నే వ్యాక్సినేషన్ ప్రచారానికి పరోక్షంగా ఉపయోగించుకోవడం విచిత్రం. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైన్ షాపుల్లో 10శాతం రాయితీ అంటూ తాజాగా మధ్యప్రదేశ్ అధికారులు చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

మధ్యప్రదేశ్ లోని మండాసుర్ జిల్లాలో ఈ నిబంధన అమలులోకి వచ్చింది. ఆ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి అనిల్ సచన్ ఆలోచనే ఇది. మందుబాబుల్లో కొవిడ్ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారాయన. వైన్ షాపుకి వచ్చేవారు ఎవరైనా.. రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ చూపిస్తే 10శాతం రాయితీతో మందు బాటిళ్లు సప్లై చేస్తారు. అయితే ఇది కూడా పరిమితికి లోబడే. వ్యాక్సిన్ వేయించుకున్నవారు మళ్లీ ఆ మందు బాటిళ్లను బ్లాక్ లో అమ్ముకోకుండా ఇలాంటి నిబంధన పెట్టారు.

మద్యం, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, ప్రజలకు అవగాహన కల్పించి, ఆయా అలవాట్లను మానుకునేలా చేయాల్సిన ప్రభుత్వాలే ఇలా మద్యం రేట్లకు, కొవిడ్ వ్యాక్సినేషన్ కు లింకు పెడుతూ ఆఫర్లు ఇవ్వడంపై విమర్శలు మొదలయ్యాయి. మద్యం షాపులకి వ్యాక్సినేషన్ తో లింకు పెడితే ఒకరో ఇద్దరో వ్యాక్సిన్ కోసం హడావిడి పడతారని, పెట్రోల్ బంకుల్లో కూడా ఇలాంటి రాయితీలిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది కదా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. అయితే మందు బాబుల్లో అవగాహన పెంచేందుకు, కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ నిబంధన పెట్టామని చెబుతున్నారు ఎక్సైజ్ అధికారులు. దీనివల్ల మధ్యప్రదేశ్ లో మద్యం సేల్స్ పెరుగుతాయా..? లేక వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుందా..? వేచి చూడాలి.

First Published:  23 Nov 2021 9:01 PM GMT
Next Story