Telugu Global
Cinema & Entertainment

పెద్ద సినిమాలపై పెద్ద దెబ్బ

సవరించిన సినిమాటోగ్రఫీ చట్టంతో రాబోయే రోజుల్లో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ముందుగా ఈ ప్రభావం అఖండ, పుష్ప సినిమాలపై పడబోతోంది. అఖండ సినిమాను సీడెడ్ లో భారీ రేట్లకు అమ్మారు. ఇలాంటి చట్టసవరణ ఉందనే విషయం ముందే తెలుసుకొని, ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా తగ్గించుకున్నారు. కానీ ఆ సినిమా వసూళ్లపై టికెట్ రేట్ల ప్రభావం పడేలా ఉంది. ఇక అఖండ తర్వాత వస్తున్న పుష్ప సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే. […]

పెద్ద సినిమాలపై పెద్ద దెబ్బ
X

సవరించిన సినిమాటోగ్రఫీ చట్టంతో రాబోయే రోజుల్లో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ముందుగా ఈ ప్రభావం అఖండ, పుష్ప సినిమాలపై పడబోతోంది. అఖండ సినిమాను సీడెడ్ లో భారీ రేట్లకు అమ్మారు. ఇలాంటి చట్టసవరణ ఉందనే విషయం ముందే తెలుసుకొని, ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా తగ్గించుకున్నారు. కానీ ఆ సినిమా వసూళ్లపై టికెట్ రేట్ల ప్రభావం పడేలా ఉంది.

ఇక అఖండ తర్వాత వస్తున్న పుష్ప సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఏపీ నుంచి వచ్చే వసూళ్లు చాలా కీలకం. టిక్కెట్ రేట్లు పెంచకపోవడం, అదనపు షోలకు అనుమతి లేకపోవడం, అంతా ఆన్ లైన్ చేయడంతో.. ఏపీలో ఈ సినిమాకు కూడా కష్టాలు/నష్టాలు తప్పకపోవచ్చు.

ఇవన్నీ ఒకెత్తయితే.. సంక్రాంతి బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి మరీ ఘోరం. ఏకంగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది ఈ సినిమా. ఆంధ్ర, సీడెడ్ కలిపి ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 98 కోట్ల రూపాయలకు అమ్మారు. టిక్కెట్ రేట్లు తగ్గించిన తర్వాత ఈ బిజినెస్ ను 68 కోట్ల రూపాయలకు తగ్గించుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో 68 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ థియేటర్లకు రావడం లేదు. దీనికితోడు కొత్త చట్టం కారణంగా టిక్కెట్ రేట్లు పెంచడానికి, అదనపు షోలకు అనుమతి లేదు. టిక్కెట్ రేట్లను కనీసం మొదటి వారం రోజుల పాటు పెంచితే బాగుంటుందని యూనిట్ భావించినప్పటికీ ఇప్పుడా అవకాశం లేదు.

అదే సీజన్ లో భీమ్లానాయక్, రాధేశ్యామ్ కూడా ఉన్నాయి. పవన్ కు ఈ కష్టాలు ఆల్రెడీ తెలుసు. అతడు నటించిన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకొచ్చిన టైమ్ లోనే ఏపీలో టికెట్ రేట్లు తగ్గించారు. ఆ ప్రభావం వకీల్ సాబ్ పై గట్టిగా పడింది. ఇప్పుడు మరింత టఫ్ కండిషన్స్ మధ్య భీమ్లానాయక్ వస్తోంది. రాధేశ్యామ్ బడ్జెట్ కూడా 250 కోట్ల రూపాయలు దాటిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆచార్య వస్తోంది. ఇలా బడా సినిమాలన్నీ సవరించిన సినిమాటోగ్రఫీ చట్టం వల్ల ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి.

First Published:  24 Nov 2021 7:19 AM GMT
Next Story