Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ ను సెట్ చేసిన సీఎం జగన్

కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో, టాలీవుడ్ లో తీవ్రంగా నలుగుతున్న టికెట్ రేట్ల వ్యవహారానికి తనదైన ముగింపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈరోజు అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ఆమోదించారు. తాజాగా ఆమోదించిన బిల్లు ప్రకారం.. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో రోజుకు 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాలి. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన టైమింగ్స్ ప్రసారమే సినిమా ప్రసారాలు సాగాలి. ఇక అత్యంత కీలకమైన టికెటింగ్ వ్యవస్థపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. బస్సు టిక్కెట్లు, రైల్వే టికెట్లు […]

tollywood hero
X

కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో, టాలీవుడ్ లో తీవ్రంగా నలుగుతున్న టికెట్ రేట్ల వ్యవహారానికి తనదైన ముగింపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈరోజు అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ఆమోదించారు. తాజాగా ఆమోదించిన బిల్లు ప్రకారం.. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో రోజుకు 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాలి. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన టైమింగ్స్ ప్రసారమే సినిమా ప్రసారాలు సాగాలి.

ఇక అత్యంత కీలకమైన టికెటింగ్ వ్యవస్థపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. బస్సు టిక్కెట్లు, రైల్వే టికెట్లు ఎలాగైతే ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటామో.. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చే నూతన ఆన్ లైన్ విధానం ద్వారా ప్రేక్షకుడు సినిమా టిక్కెట్లు ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఇక థియేటర్లలో సినిమా ప్రదర్శనకు గంట ముందు మిగిలిన టిక్కెట్లను విక్రయిస్తారు. అక్కడ కూడా ఆన్ లైన్ వ్యవస్థే ఉంటుంది. బాక్సాఫీస్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ ద్వారానే టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆన్ లైన్ వ్యవస్థ మొత్తం ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాగుతుంది.

బెనిఫిట్ షోలు, అదనపు టికెట్ రేట్లపై కూడా క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం. ఇకపై ప్రభుత్వం విధించిన రేట్లకు మాత్రమే టిక్కెట్లు అమ్మాలి. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు లాభం చేకూరుతుంది. అందుబాటు ధరల్లో వాళ్లకు వినోదం అందుతుంది. బెనిఫిట్ షోలు పూర్తిగా రద్దు చేస్తూ బిల్లులో సవరణ చేశారు. రోజుకు 5-6 ఆటలు వేసుకునే సంస్కృతికి చెక్ పెట్టారు.

థియేట్రికల్ బిజినెస్ నుంచి వస్తున్న ఆదాయంపై చాలా అనుమానాలు, అవకతవకలు ఉన్నాయి. తాజా సవరణతో వాటన్నింటినీ సెట్ చేశారు. ఏ థియేటర్ లో ఎన్ని టిక్కెట్లు తెగాయనే విషయం మొత్తం ఆన్ లైన్ లో నిక్షిప్తం అవుతుంది. రాష్ట్రంలోని 1100 థియేటర్లను ఆన్ లైన్ కిందకు తీసుకురాబోతున్నారు. అలా ఆన్ లైన్ లో కలెక్ట్ అయిన మొత్తం నుంచి హేతుబద్దంగా పన్నును మినహాయించుకొని, మిగతా మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్ లేదా ఎగ్జిబిటర్ కు అందిస్తుంది ప్రభుత్వం. ఈ చెల్లింపులన్నీ ఏ రోజుకారోజు అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం నుంచి జరిగిపోతాయి.

First Published:  24 Nov 2021 7:29 AM GMT
Next Story