Telugu Global
Cinema & Entertainment

మళ్లీ సెట్స్ పైకొచ్చిన చిరంజీవి

ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసిన తర్వాత మళ్లీ సెట్స్ పైకి రాలేదు. మళ్లీ షార్ట్ గ్యాప్ తర్వాత చిరంజీవి సెట్స్ పైకి వచ్చేశారు. చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. AS ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి […]

మళ్లీ సెట్స్ పైకొచ్చిన చిరంజీవి
X

ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసిన తర్వాత మళ్లీ సెట్స్ పైకి రాలేదు. మళ్లీ షార్ట్ గ్యాప్ తర్వాత చిరంజీవి సెట్స్ పైకి వచ్చేశారు. చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. AS ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి మీద ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

భోళా శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్‌లో చూపించబోతోన్నారు.

అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. కీర్తి సురేష్ ఆయన చెల్లిగా కనిపించనున్నారు. పక్కా కమర్షియల్‌గా ఈ చిత్రం ఉండబోతోంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

First Published:  16 Nov 2021 8:25 AM GMT
Next Story