Telugu Global
NEWS

బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తం.. పరస్పరం రాళ్లు రువ్వుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు

వరి ధాన్యం విక్రయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో చేపట్టిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వు కోవడంతో అక్కడ ఉన్న రైతులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇవాళ మధ్యాహ్నం బండి సంజయ్ రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాలోని ఆర్జాల బావి ఐకేపీ సెంటర్ వద్దకు బయలుదేరాడు. ఆయన అక్కడికి చేరుకోకముందే టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో […]

బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తం.. పరస్పరం రాళ్లు రువ్వుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు
X

వరి ధాన్యం విక్రయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో చేపట్టిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వు కోవడంతో అక్కడ ఉన్న రైతులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఇవాళ మధ్యాహ్నం బండి సంజయ్ రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాలోని ఆర్జాల బావి ఐకేపీ సెంటర్ వద్దకు బయలుదేరాడు. ఆయన అక్కడికి చేరుకోకముందే టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. బండి సంజయ్ అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

‘బండి సంజయ్ గో బ్యాక్’ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండగానే బండి సంజయ్ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం ప్రారంభించారు. అంతలోనే టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్పటివరకూ ధాన్యం కుప్పల వద్ద పనిచేసుకుంటున్న రైతులు, మహిళలు భయాందోళనతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు వందల సంఖ్యలో ధాన్యం కుప్పలపై పరుగులు తీయడంతో ధాన్యమంతా చెల్లాచెదురైంది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నడుమ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలు కనిపించడం లేదని, ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం పీకుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రైతుల పట్ల గజినీగా మారారని, ఒకసారి పత్తి వేయాలని, మరోసారి వరి వేయాలని, ఇంకోసారి వరి వేస్తే ఉరే.. అని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

గతంలో రాష్ట్రంలో రైతులు సాగు చేసే ప్రతి గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఆయన మాటలు నమ్మి రైతులు వరిసాగు చేసి కళ్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు.

ఆర్జాల బావి ఐకేపీ సెంటర్ లో తాను పర్యటిస్తున్నట్లు పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని.. అయినా వారు భద్రత కల్పించడంలో విఫలయ్యారన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని బండి సంజయ్ విమర్శలు చేశారు.

First Published:  15 Nov 2021 8:20 AM GMT
Next Story