Telugu Global
Cinema & Entertainment

పుష్పరాజ్ సరసన సమంత

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత పూర్తిగా సినిమాలపై దృష్టిపెట్టింది సమంత. ఇందులో భాగంగా ఇప్పటికే 2 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రెండూ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలే. ఇలా తన మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది సమంత. పుష్ప సినిమాలో ఆమె ఓ ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశం ఉంది. పుష్ప సినిమా కోసం అదిరిపోయే ఐటెంసాంగ్ కంపోజ్ చేశాడు దేవిశ్రీప్రసాద్. ఈ పాట […]

పుష్పరాజ్ సరసన సమంత
X

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత పూర్తిగా సినిమాలపై దృష్టిపెట్టింది సమంత. ఇందులో భాగంగా ఇప్పటికే 2 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రెండూ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలే. ఇలా తన మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది సమంత. పుష్ప సినిమాలో ఆమె ఓ ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశం ఉంది.

పుష్ప సినిమా కోసం అదిరిపోయే ఐటెంసాంగ్ కంపోజ్ చేశాడు దేవిశ్రీప్రసాద్. ఈ పాట కోసం బాలీవుడ్ ముద్దుగమ్మను తీసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా ఊర్వశి రౌథేలాను సంప్రదించారు, ఆమె అంగీకరించింది కూడా. అంతలోనే సమంత లైన్లోకి రావడంతో, ఊర్వశి స్థానంలో ఆమెను తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. సమంత రాకతో పుష్ప ప్రాజెక్టు వెయిట్ మరింత పెరిగింది.

సమంతకు స్పెషల్ సాంగ్స్ కొత్త కాదు. గతంలోనే ఆమె అలాంటి సాంగ్స్ చేసింది. అయితే నాగచైతన్యతో పెళ్లయిన తర్వాత ఆ తరహా పాటలు తగ్గించింది. ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్స్ కు కూడా ఓకే చెబుతోంది సమంత.

First Published:  14 Nov 2021 3:21 AM GMT
Next Story