Telugu Global
Cinema & Entertainment

మేం కోర్టుకు వెళ్లడం లేదు

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నిన్నటివరకు ఓ పెద్ద పుకారు నడిచింది. ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టికెట్ రేట్లపై ఆర్ఆర్ఆర్ యూనిట్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని, రేపోమాపో కోర్టులో పిటిషన్ వేస్తుందని ప్రచారం జరిగింది. దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తాము కోర్టుకు వెళ్లడం లేదని ఈరోజు స్పష్టంచేసింది. “ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టిక్కెట్ ధరలు ఆర్ఆర్ఆర్ సినిమాపై పెను ప్రభావం చూపిస్తాయనే మాట వాస్తవం. అయితే దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచన మాత్రం మాకు లేదు. […]

మేం కోర్టుకు వెళ్లడం లేదు
X

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నిన్నటివరకు ఓ పెద్ద పుకారు నడిచింది. ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టికెట్ రేట్లపై ఆర్ఆర్ఆర్ యూనిట్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని, రేపోమాపో కోర్టులో పిటిషన్ వేస్తుందని ప్రచారం జరిగింది. దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తాము కోర్టుకు వెళ్లడం లేదని ఈరోజు స్పష్టంచేసింది.

“ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టిక్కెట్ ధరలు ఆర్ఆర్ఆర్ సినిమాపై పెను ప్రభావం చూపిస్తాయనే మాట వాస్తవం. అయితే దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచన మాత్రం మాకు లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అంశంపై కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం. మా పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కోసం ప్రయత్నిస్తాం.” ఇలా నిన్నటివరకు జరిగిన ప్రచారాన్ని యూనిట్ ఖండించింది.

దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ సినిమా. బిజినెస్ కూడా చాన్నాళ్ల కిందటే ముగిసింది. ఆ తర్వాత ఏపీలో టిక్కెట్ రేట్లు తగ్గించారు. దీంతో నిర్మాతలు కూడా తమ బిజినెస్ ను తగ్గించుకున్నారు. ఆంధ్ర, సీడెడ్ కలిపి ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 98 కోట్ల రూపాయలకు అమ్మారు. టిక్కెట్ రేట్లు తగ్గించిన తర్వాత ఈ బిజినెస్ ను 68 కోట్ల రూపాయలకు తగ్గించుకున్నారు మేకర్స్.

అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో 68 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ థియేటర్లకు రావడం లేదు. ఈ నేపథ్యంలో టిక్కెట్ రేట్లను కనీసం మొదటి వారం రోజుల పాటు పెంచితే బాగుంటుందని యూనిట్ భావిస్తోంది. ఇదే ఎజెండాతో ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తోంది.

First Published:  14 Nov 2021 3:26 AM GMT
Next Story