Telugu Global
Cinema & Entertainment

ఆ అమ్మాయి వచ్చే నెల వస్తోంది

రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమా “అమ్మాయి”. ఈ చిత్రాన్ని హిందీ, చైనీస్ భాషలో విడుదలకు సిద్ధం అవుతుండగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. హిందీ ఈ సినిమాకు లడకీ, చైనీస్ లో డ్రాగన్ గర్ల్ అనే పేర్లు పెట్టారు. ఈ అన్ని వెర్షన్లను డిసెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా […]

ఆ అమ్మాయి వచ్చే నెల వస్తోంది
X

రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమా “అమ్మాయి”. ఈ చిత్రాన్ని హిందీ, చైనీస్ భాషలో విడుదలకు సిద్ధం అవుతుండగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. హిందీ ఈ సినిమాకు లడకీ, చైనీస్ లో డ్రాగన్ గర్ల్ అనే పేర్లు పెట్టారు. ఈ అన్ని వెర్షన్లను డిసెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా ఆర్ట్ సి మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

“అమ్మాయి” చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులు అయినా పూజ భలేకర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తన ఫైటింగ్ స్కిల్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ కి అంకితం ఇస్తున్నారు. “అమ్మాయి” చిత్రం భారత దేశంలోనే మొదటి వాస్తవికమైన మార్షల్ ఆర్ట్స్ చిత్రం.

అమ్మాయి చైనీస్ వెర్షన్ చిత్రాన్ని చైనా లోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ వారు డ్రాగన్ గర్ల్ పేరుతో భారీ ప్రమోషన్ తో 20 వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. దుబాయ్ లో ప్రపంచంలోనే ఎతైన బుర్జ్ ఖలీఫా భవనం మీద అమ్మాయి చిత్రం మొదటి ప్రపంచ ప్రోమోని చూపించబోతున్నారు.

First Published:  14 Nov 2021 3:09 AM GMT
Next Story