Telugu Global
Cinema & Entertainment

అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయట

నెగెటివ్ టాక్ తెచ్చుకున్న పుష్పక విమానం సినిమా సూపర్ హిట్టయిందంటున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. అమెరికా నుంచి కూడా చాలామంది తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారని చెప్పుకొచ్చాడు. మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆనంద్, తన నమ్మకం నిజమైందంటున్నాడు. “పుష్పక విమానం మీద మా అంచనాలు నిజమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా హిట్ టాక్ వస్తోంది. అన్నయ్య విజయ్ యూఎస్ లో ఉన్నారు. థియేటర్ […]

అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయట
X

నెగెటివ్ టాక్ తెచ్చుకున్న పుష్పక విమానం సినిమా సూపర్ హిట్టయిందంటున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. అమెరికా నుంచి కూడా చాలామంది తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారని చెప్పుకొచ్చాడు. మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆనంద్, తన నమ్మకం నిజమైందంటున్నాడు.

“పుష్పక విమానం మీద మా అంచనాలు నిజమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా హిట్ టాక్ వస్తోంది. అన్నయ్య విజయ్ యూఎస్ లో ఉన్నారు. థియేటర్ లలో “పుష్పక విమానం” కు వస్తున్న రెస్పాన్స్ వీడియోలు ఆయనకు పంపించాం. విజయ్ నిర్మాతగా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు. నా పర్మార్మెన్స్ తో పాటు ఇద్దరు హీరోయిన్స్ నటన బాగుందని చెబుతున్నారు. నాకు ఇండస్ట్రీ నుంచే కాకుండా యూఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కథ విన్నప్పుడు దర్శకుడు చెప్పాడు…కామెడీ ఫ్లస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడేలా సినిమా
చేయొచ్చని, ఇవాళ థియేటర్లలో అదే రెస్పాన్స్ వస్తోంది.”

భార్య లేచిపోయిందనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన పుష్పకవిమానం సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారంటున్నాడు ఆనంద్ దేవరకొండ. కథలో సందర్భానుసారంగా వచ్చే కామెడీ సీన్స్ కు అంతా బాగా నవ్వుకుంటున్నారని.. ఇలాంటి సిట్యువేషనల్ కామెడీ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో రాలేదంటున్నాడు. మరో 2 వారాల పాటు ప్రేక్షకులు పుష్పకవిమానం సినిమాను ఆదరించాలని కోరుతున్నాడు.

First Published:  14 Nov 2021 3:05 AM GMT
Next Story