Telugu Global
National

చెన్నైలో 500శాతం అధికంగా వర్షం.. మరో అల్పపీడనంతో కలవరం..

వాయుగుండం ముప్పు దాటిపోయినా.. శుక్రవారం కూడా తమిళనాడు, ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెన్నైలో గత 6 రోజుల్లో సాధారణంకంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం విశేషం. అక్టోబర్ నెలలో చెన్నైలో సాధారణ వర్షపాతం 8 సెంటీమీటర్లు కాగా, ఈ ఏడాది ఏకంగా 42 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి తోడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందనే వార్తలు నగర వాసుల్ని మరింత కలవరపెడుతున్నాయి. తమిళనాడులో మొత్తం 18 జిల్లాలపై వర్షం తీవ్ర […]

చెన్నైలో 500శాతం అధికంగా వర్షం.. మరో అల్పపీడనంతో కలవరం..
X

వాయుగుండం ముప్పు దాటిపోయినా.. శుక్రవారం కూడా తమిళనాడు, ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెన్నైలో గత 6 రోజుల్లో సాధారణంకంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం విశేషం. అక్టోబర్ నెలలో చెన్నైలో సాధారణ వర్షపాతం 8 సెంటీమీటర్లు కాగా, ఈ ఏడాది ఏకంగా 42 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి తోడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందనే వార్తలు నగర వాసుల్ని మరింత కలవరపెడుతున్నాయి.

తమిళనాడులో మొత్తం 18 జిల్లాలపై వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. తమిళనాడు వ్యాప్తంగా 142శాతం అధికంగా వర్షాలు పడ్డాయని అక్టోబర్ లో రాష్ట్ర సగటు వర్షపాతం 10 సెంటీమీటర్లుగా నమోదు కావడం మరో రికార్డ్ అని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ అండమాన్ లో అల్పపీడనం ఏర్పడుతుందని 15వతేదీకి అది ఉధృతంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దాని ప్రభావం చెన్నైపై పడితే మరోసారి మునక తప్పదని చెబుతున్నారు.

శుక్రవారానికి వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టినా కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు పడ్డాయి. కన్యాకుమారిలో అత్యథికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నైలో మొత్తం 529 ప్రాంతాల్లో వరదనీరు తిష్టవేసింది. ఇప్పటికీ అందులో 300 ప్రాంతాల్లో జనజీవనం సాధారణ స్థాయికి చేరుకోలేదు. సబ్ వే లలోకి నీరు చేరడంతో వాటిని మూసే ఉంచారు అధికారులు. రెడ్ హిల్స్, చెంబరంబాక్కం రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉన్నాయి. వాటి నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది.

ఏపీలోనూ కొనసాగిన వర్షాలు..
ఇటు దక్షిణ కోస్తాలో కూడా శుక్రవారం వర్షాలు కొనసాగాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శుక్రవారం కడప, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ అండమాన్ లో ఏర్పడే అల్పపీడన ప్రభావం ఏపీపై కూడా ఉంటుందనే సమాచారంతో కోస్తా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

First Published:  12 Nov 2021 9:16 PM GMT
Next Story