Telugu Global
International

ఆహార సంక్షోభం.. లక్షల కోట్ల దిగుమతుల భారం..

కరోనా కాలంలో భారత్ లో వంటనూనెల ధరలు రెట్టింపయ్యాయి. ఆమాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెలు, ఇతర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. ఉత్పత్తి పడిపోవడం, రవాణా లేకపోవడంతో ఆమాత్రం తేడా ఉంటుందని అనుకున్నారంతా. కానీ పరిస్థితులు చక్కబడినా ఇప్పటికీ ఆ వ్యత్యాసం కొనసాగుతూనే ఉంది. దిగుమతులపైనే ఆధారరం.. అమెరికాపై ఆహార పదార్ధాల దిగుమతుల భారం ఈ ఏడాది 14శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. 1.75 ట్రిలియన్ డాలర్లు.. కేవలం ఆహార పదార్ధాల దిగుమతులకోసమే అమెరికా ఖర్చు పెట్టాల్సిన […]

ఆహార సంక్షోభం.. లక్షల కోట్ల దిగుమతుల భారం..
X

కరోనా కాలంలో భారత్ లో వంటనూనెల ధరలు రెట్టింపయ్యాయి. ఆమాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెలు, ఇతర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. ఉత్పత్తి పడిపోవడం, రవాణా లేకపోవడంతో ఆమాత్రం తేడా ఉంటుందని అనుకున్నారంతా. కానీ పరిస్థితులు చక్కబడినా ఇప్పటికీ ఆ వ్యత్యాసం కొనసాగుతూనే ఉంది.

దిగుమతులపైనే ఆధారరం..
అమెరికాపై ఆహార పదార్ధాల దిగుమతుల భారం ఈ ఏడాది 14శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. 1.75 ట్రిలియన్ డాలర్లు.. కేవలం ఆహార పదార్ధాల దిగుమతులకోసమే అమెరికా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వాతావరణ పరిస్థితుల్లో వ్యత్యాసం, ఆహార పదార్ధాల ఉత్పత్తి, రవాణా భారం పెరగడంతో దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు.. పానీయాలు, మాసం వంటి ఉత్పత్తులపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూరగాయలు, ధాన్యంపై అధికంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార ధాన్యాలకోసం చేసే ఖర్చు అభివృద్ధి చెందిన దేశాల్లో 11శాతం వరకు పెరిగితే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది ఏకంగా 20 శాతం వరకు పెరిగింది. అంటే ఒకరకంగా పేద దేశాలే ఎక్కువగా ఆహార సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి. ఉత్పత్తి లేక, దిగుమతుల భారం మోయలేక ప్రజలు ఆకలితో అల్లాడిపోవాల్సిన పరిస్థితి.

దశాబ్దకాలంలో ఇదే ఎక్కువ..
దశాబ్దకాలంగా ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతూనే ఉన్నా.. ఈ రెండేళ్లలో ఊహించని స్థాయిలో వాటి పెరుగుదల నమోదైంది. అనుకూల వాతావరణ పరిస్థితులు లేక పంటల ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడం మరో కారణం. ఇక ఇంధన ధరలు పెరగడంతో.. రవాణా రేట్లు పెరిగిపోవడం కూడా అంతిమంగా ఆహార ధాన్యాల రేట్ల పెరుగుదలకు కారణం అయింది.

First Published:  11 Nov 2021 9:54 PM GMT
Next Story