బక్కరైతులే బలవుతున్నారు.. ఉద్యమానికి ఏడాది..
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఢిల్లీలో రైతుల దీక్షలు మొదలై ఏడాది కావస్తోంది. చర్చల కాలం కూడా లెక్కిస్తే.. ఏడాదిపైగానే రైతులు వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలో అసలు రైతు దీక్షలతో కలిగిన ప్రయోజనం ఏంటి..? ప్రభుత్వం మెత్తబడిందా..? రైతుల బలిదానాలతో తీరని నష్టం జరిగిందా..? అనే విషయంపై పటియాలాలోని పంజాబి యూనివర్శిటీతో కలసి ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆందోళనలో […]
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఢిల్లీలో రైతుల దీక్షలు మొదలై ఏడాది కావస్తోంది. చర్చల కాలం కూడా లెక్కిస్తే.. ఏడాదిపైగానే రైతులు వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలో అసలు రైతు దీక్షలతో కలిగిన ప్రయోజనం ఏంటి..? ప్రభుత్వం మెత్తబడిందా..? రైతుల బలిదానాలతో తీరని నష్టం జరిగిందా..? అనే విషయంపై పటియాలాలోని పంజాబి యూనివర్శిటీతో కలసి ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 600మంది రైతుల్లో 80శాతం మంది సన్న, చిన్నకారు రైతులేననే విషయం తేలింది.
రైతు ఉద్యమంలో బలిదానాలు జరిగాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉద్యమ సమయంలో తీవ్ర మనోవేదనకు గురై మరి కొంతమంది మరణించారు. అలా మరణించిన రైతులకు చెందిన వివరాలు లెక్క తీస్తే.. సగటున ఒక్కొకరు 2.94 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్టు తేలింది. అసలు సొంత పొలమే లేని రైతుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మరణించిన ఒక్కోరైతు కలిగి ఉన్న పొలం సగటు విస్తీర్ణం 2.26 ఎకరాలు మాత్రమే. అంటే ఉద్యమంలో సన్న, చిన్నకారు రైతులు, పొలం లేని కౌలు రైతులే తమ ప్రాణాలు పోగొట్టుకున్నారనే విషయం స్పష్టమవుతోంది.
అధికారిక లెక్కల ప్రకారం రైతు ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 600 కాగా.. అనధికారికంగా వెయ్యికి మించి ఉంటుందని సర్వే తేల్చింది. అత్యథికంగా పంజాబ్ కి చెందిన 460మంది ఊ ఉద్యమ సమయంలో.. అంటే ఏడాది కాలంలో ప్రాణాలు కోల్పోయారు. మాల్వా ప్రాంతానికి చెందినవారు 367మంది, మాజా ప్రాంతానికి చెందినవారు 59మంది, డోబా ప్రాంతానికి చెందిన రైతులు 34మంది చనిపోయారు.
ఏడాది కాలంగా ఉద్యమం జరుగుతోందని.. వెయ్యిమందికి పైగా రైతులు ఉద్యమం కోసం బలయ్యారని.. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు రైతు సంఘాల నేతలు. భూస్వాములెవరూ ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోలేదు. సామాన్య రైతులే చట్టాలరద్దుకోసం ఆందోళన చేస్తూ అసువులుబాశారు. కుటుంబాలకు తీరని ఆవేదన మిగిల్చారు.