Telugu Global
Cinema & Entertainment

డేట్ ఫిక్స్ చేసిన రవితేజ

రవితేజ, రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదల చేసిన 2 […]

డేట్ ఫిక్స్ చేసిన రవితేజ
X

రవితేజ, రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదల చేసిన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశకు చేరుకున్నాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియెస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌ బ్యానర్ పై తెరకెక్కుతోంది. సీనియర్ నటుడు అర్జున్, అనసూయ రెండు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

First Published:  11 Nov 2021 6:51 AM GMT
Next Story