Telugu Global
NEWS

ఒక వాయుగుండం.. రెండు రాష్ట్రాలకు గండం..

బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు చెన్నై అల్లాడిపోతోంది ఇటు ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాయుగుండం ఈరోజు సాయంత్రానికి కడలూరు సమీపంలో తీరం దాతుటుందని వాతావరణ విభాగం తెలిపింది. బుధవారం రాత్రికి వాయుగుండం ప్రభావం తీవ్రం కావడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు చెన్నైలో […]

ఒక వాయుగుండం.. రెండు రాష్ట్రాలకు గండం..
X

బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు చెన్నై అల్లాడిపోతోంది ఇటు ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాయుగుండం ఈరోజు సాయంత్రానికి కడలూరు సమీపంలో తీరం దాతుటుందని వాతావరణ విభాగం తెలిపింది.

బుధవారం రాత్రికి వాయుగుండం ప్రభావం తీవ్రం కావడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు చెన్నైలో కూడా వర్షాల కష్టాలు కొనసాగాయి. ఈరోజు ఉదయం వాయుగుండం ప్రభావం పెరుగుతుందని, సాయంత్రానికి కరైకల్-శ్రీహరికోట మధ్యలో కడలూరు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో 70కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో గడచిన 12 గంటల సమయంలోనే తడలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాకాడులో 6, నాయుడుపేటలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

అటు తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెన్నైతోపాటు మరో 8 జిల్లాల్లో బుధ, గురువారాలు సెలవలు ప్రకటించారు. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్టు అధికారిక సమాచారం. రెండు రోజుల్లో చెన్నైలో 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం కురుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2 లక్షల 50వేలమందిపై వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో మొత్తం 200 మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేశారు అధికారులు. నగరంలో 46 పడవలను మోహరించి ఎన్డీఆర్ఎఫ్ సహాయ కార్యక్రమాలు చేపట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సీఎం స్టాలిన్ స్వయంగా వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా ఆయనే అన్ని ప్రాంతాలకు వెళ్లి పునరావాసం, ఇతర కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నేరుగా బాధితులతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వాయుగుండం తీరం దాటేవరకు చెన్నై సహా 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

First Published:  10 Nov 2021 9:34 PM GMT
Next Story