Telugu Global
Cinema & Entertainment

రేపు హిట్టయ్యే సినిమా ఏది?

ఈ శుక్రవారం 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో అంచనాలు రేకెత్తిస్తున్న సినిమాలు రెండే. వాటిలో ఒకటి పుష్పక విమానం కాగా.. రెండోది రాజా విక్రమార్క. ఆనంద్ దేవరకొండ, కార్తికేయ హీరోలుగా నటించిన ఈ రెండు సినిమాలపైనే టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి ఉంది. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా రాజా విక్రమార్క. శ్రీ సరిపల్లి డైరక్ట్ చేసిన ఈ మూవీలో తనికెళ్ల భరణి, సాయికుమార్, సుధాకర్ కోమాకుల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా ట్రయిలర్ […]

రేపు హిట్టయ్యే సినిమా ఏది?
X

ఈ శుక్రవారం 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో అంచనాలు రేకెత్తిస్తున్న సినిమాలు రెండే. వాటిలో ఒకటి పుష్పక విమానం కాగా.. రెండోది రాజా విక్రమార్క. ఆనంద్ దేవరకొండ, కార్తికేయ హీరోలుగా నటించిన ఈ రెండు సినిమాలపైనే టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి ఉంది.

కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా రాజా విక్రమార్క. శ్రీ సరిపల్లి డైరక్ట్ చేసిన ఈ మూవీలో తనికెళ్ల భరణి, సాయికుమార్, సుధాకర్ కోమాకుల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్ కూడా గట్టిగా చేశారు. రిజల్ట్ ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

‘రాజావిక్రమార్క’కు పోటీగా వస్తున్న సినిమా ‘పుష్పక విమానం’. ఆనంద్ దేవరకొండకు ఇది మూడో సినిమా. ఇంతకుముందు ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలు చేశాడు. ‘పుష్పకవిమానం’ సినిమాలో భార్య లేచిపోయిన భర్త పాత్రలో కనిపించబోతున్నాడు ఆనంద్ దేవరకొండ. సునీల్ ఇందులో పోలీసాఫీసర్ గా నటించాడు. మూవీలో ఎంత ఫన్ ఉంటుందో, అంతే ఎమోషన్ ఉంటుందంటున్నాడు ఆనంద్.

ఈ రెండు సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్, తెలంగాణ దేవుడు, ది ట్రిప్, కపటనాటక సూత్రధారి సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.

First Published:  11 Nov 2021 6:48 AM GMT
Next Story