Telugu Global
National

ఎంపీ లాడ్స్ పునరుద్ధరణ.. ఇరకాటంలో కేంద్రం..

మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్ మెంట్ స్కీమ్ (ఎంపీ లాడ్స్) పునరుద్ధరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. తీవ్ర కలకలం రేగింది. సస్పెండ్ చేసిన ఎంపీ లాడ్స్ నిధులకు లెక్క చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. శ్వేత పత్రం విడుదల చేయాలని కోరాయి. నిధుల్ని అకస్మాత్తుగా ఆపేసిన కేంద్రం.. వాటిని కరోనా కష్టకాలంలో ఏయే కార్యక్రమాలకు ఉపయోగపెట్టిందో లెక్క తేల్చాలని అన్నారు డీఎంకే, ఆర్జేడీ నేతలు. పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీ లాడ్స్ […]

ఎంపీ లాడ్స్ పునరుద్ధరణ.. ఇరకాటంలో కేంద్రం..
X

మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్ మెంట్ స్కీమ్ (ఎంపీ లాడ్స్) పునరుద్ధరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. తీవ్ర కలకలం రేగింది. సస్పెండ్ చేసిన ఎంపీ లాడ్స్ నిధులకు లెక్క చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. శ్వేత పత్రం విడుదల చేయాలని కోరాయి. నిధుల్ని అకస్మాత్తుగా ఆపేసిన కేంద్రం.. వాటిని కరోనా కష్టకాలంలో ఏయే కార్యక్రమాలకు ఉపయోగపెట్టిందో లెక్క తేల్చాలని అన్నారు డీఎంకే, ఆర్జేడీ నేతలు.

పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీ లాడ్స్ పథకం ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎంపీకి ఏడాదికి 5 కోట్ల రూపాయలు ఇస్తారు. ఏడాదికి రెండు విడతల్లో రూ.2.5 కోట్ల చొప్పున చెల్లింపులు ఉంటాయి. లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులకు ఎక్కువగా వీటిని కేటాయిస్తారు. రాజ్యసభ సభ్యులకు అలాంటి పరిధులేవీ ఉండదు. ఎక్కడ, ఎలా ఖర్చు పెట్టాలనేది ఎంపీల ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో 2020 ఏప్రిల్‌ నుంచి ఈ పథకాన్ని నిలిపివేశారు. ఎంపీలకు నిధులివ్వడం ఆపేసింది కేంద్రం. తాజాగా దీన్ని పునరుద్ధరిస్తున్నట్టు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయన కాలానికి రూ.2కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 2022 నుంచి 2026 వరకు 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసే వరకు ప్రతి ఆర్థిక సంవత్సరం ఒక్కో ఎంపీకి రూ.5కోట్లు కేటాయిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే నిధుల విషయంలో డీఎంకే, ఆర్జేడీ కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.

తమిళనాడుకి సంబంధించి 39 లోక్ సభ, 18 రాజ్యసభ స్థానాలున్నాయి. అందరికీ కలిపి ఏడాదికి 285 కోట్ల రూపాయలు ఎంపీ లాడ్స్ కింద మంజూరవుతాయి. ఇప్పటి వరకూ నిలుపుదల చేసిన ఎంపీ లాడ్స్ నిధులతో కేంద్రం ఏయే కార్యక్రమాలు చేపట్టిందని డీఎంకే రాజ్యసభ సభ్యులు విల్సన్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్జేడీ నేత మనోజ్ ఝా కూడా ఇదే విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. నిలుపుదల చేసిన ఎంపీ లాడ్స్ నిధుల విడుదలపై శ్వేత పత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు లెక్కలడిగే సరికి కేంద్రం ఇప్పుడు ఇరుకున పడింది.

First Published:  10 Nov 2021 11:04 PM GMT
Next Story