Telugu Global
Cinema & Entertainment

గ్రాండ్ గా ప్రారంభమైన భోళాశంకర్

చిరంజీవి కొత్త సినిమా అట్టహాసంగా మొదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న భోళాశంకర్ సినిమా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ ఓపెనింగ్ కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. చిరంజీవిపై ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. రాఘవేంద్రరావుతో పాటు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబి, వినాయక్, కొరటాల, హరీష్ శంకర్ లాంటి దర్శకులందరి చేతుల మీదుగా స్క్రిప్ట్ అందుకున్నాడు దర్శకుడు మెహర్ రమేష్. హీరోయిన్ తమన్న కూడా ఈ ఓపెనింగ్ […]

గ్రాండ్ గా ప్రారంభమైన భోళాశంకర్
X

చిరంజీవి కొత్త సినిమా అట్టహాసంగా మొదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న భోళాశంకర్ సినిమా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ ఓపెనింగ్ కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. చిరంజీవిపై ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు.

రాఘవేంద్రరావుతో పాటు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబి, వినాయక్, కొరటాల, హరీష్ శంకర్ లాంటి దర్శకులందరి చేతుల మీదుగా స్క్రిప్ట్ అందుకున్నాడు దర్శకుడు మెహర్ రమేష్. హీరోయిన్ తమన్న కూడా ఈ ఓపెనింగ్ కు వచ్చింది. సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటించనున్న కీర్తిసురేష్ మాత్రం, మరో సినిమా షూటింగ్ కారణంగా హాజరుకాలేకపోయింది.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మాతగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది భోళాశంకర్ సినిమా. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. తమిళ్ లో పెద్ద హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తోంది భోళాశంకర్.

భోళాశంకర్ కోసం భారీ సెట్ల నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో, చిరంజీవి లాంటి స్టార్ తో షూటింగ్ చేయలేరు కాబట్టి.. చాలా సెట్లు వేస్తున్నారు. వీటిలో కోల్ కతా సెట్, హైదరాబాద్ సెట్స్ హైలెట్ గా నిలుస్తాయంటున్నాడు దర్శకుడు మెహర్. పేరుకు ఇది రీమేక్ సినిమానే అయినప్పటికీ.. రైటింగ్ డిపార్ట్ మెంట్ తో కూర్చొని ఏడాదిన్నర పాటు రీవర్క్ చేసి భోళాశంకర్ స్క్రిప్ట్ తయారుచేశాడట మెహర్. 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

First Published:  11 Nov 2021 6:54 AM GMT
Next Story