Telugu Global
Cinema & Entertainment

నేను రెగ్యులర్ హీరోగా ఉండను

రెగ్యులర్ హీరోగా ఉండడం తనకు ఇష్టంలేదంటున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని, తనకు హీరోయిజం అక్కర్లేదని క్లియర్ గా చెప్పేస్తున్నాడు. భార్య లేచిపోయిన భర్త పాత్ర చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదని, తను మాత్రం మూసకు భిన్నంగా వెళ్లాలనే ఉద్దేశంతో పుష్పక విమానం సినిమా చేశానంటున్నాడు. “రెగ్యులర్ హీరోగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దొరసాని సినిమా టైమ్ లో ఇలా ఉండాలని తెలీదు. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం […]

నేను రెగ్యులర్ హీరోగా ఉండను
X

రెగ్యులర్ హీరోగా ఉండడం తనకు ఇష్టంలేదంటున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని, తనకు హీరోయిజం అక్కర్లేదని క్లియర్ గా చెప్పేస్తున్నాడు. భార్య లేచిపోయిన భర్త పాత్ర చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదని, తను మాత్రం మూసకు భిన్నంగా వెళ్లాలనే ఉద్దేశంతో పుష్పక విమానం సినిమా చేశానంటున్నాడు.

“రెగ్యులర్ హీరోగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దొరసాని సినిమా టైమ్ లో ఇలా ఉండాలని తెలీదు. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. అందులో కమర్షియల్ గా వెళ్లినా, లేక పూర్తిగా నేచురల్ గా వెళ్లినా ఫలితం మరోలా ఉండేది. కానీ మేము మధ్యదారిలో సినిమా చేయడం వల్ల దొరసాని అనుకున్నంత విజయం సాధించలేదు అనిపిస్తుంటుంది. మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా టైమ్ కు ఆ కథ ఎంత వర్కవుట్ అవుతుంది అనేది మాకు అంచనా లేదు. అంతా బొంబాయి చట్నీ కథ అనేవారు. కానీ ఆ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని మాకు నమ్మకం. అది
వర్కవుట్ అయ్యింది.”

ఇలా తన సినీ కెరీర్ ను విశ్లేషించాడు ఆనంద్ దేవరకొండ. పుష్పక విమానం కాకుండా చేతిలో మరో 3 సినిమాలున్నాయని, అవన్నీ నటుడిగా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో అంగీకరించిన కథలే అంటున్నాడు ఈ హీరో. భవిష్యత్తులో కూడా ఓ నటుడిగా మాత్రమే కొనసాగుతానని, రెగ్యులర్ హీరో ఇమేజ్ తనకు వద్దని చెబుతున్నాడు.

First Published:  11 Nov 2021 6:52 AM GMT
Next Story