ఓరి దేవుడా అంటున్న విశ్వక్ సేన్
విష్వక్ సేన్ కెరీర్ లో 6వ సినిమా రెడీ అవుతోంది. విశ్వక్ హీరోగా, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఓరి దేవుడా’. పి.వి.పి సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓరిదేవుడా చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చర్చి ప్రాంగణంలో అందమైన సీతాకోక […]

విష్వక్ సేన్ కెరీర్ లో 6వ సినిమా రెడీ అవుతోంది. విశ్వక్ హీరోగా, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఓరి దేవుడా’. పి.వి.పి సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓరిదేవుడా చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
చర్చి ప్రాంగణంలో అందమైన సీతాకోక చిలుక ఎగురుతుంటుంది. దాన్ని పట్టుకోవడానికి కోటు, సూటు వేసుకున్న హీరో విష్వక్ సేన్ ప్రయత్నిస్తుంటే ..పెళ్లి కూతురి డ్రెస్‌లో ఉన్న హీరోయిన్ మిథిలా పాల్కర్ అతన్ని ఓ దారంతో కట్టి ఆపడానికి ప్రయత్నిస్తుంటుంది. ‘ఓరి దేవుడా’ చిత్రం ఎంటర్‌టైనింగ్‌గా, రొమాంటిక్‌గా సాగే చిత్రమని టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలను అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి వంశీ కాకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ మై కడవులే సినిమాకు అఫీషియల్ రీమేక్ ఈ సినిమా.