Telugu Global
National

చెన్నైలో వర్షాలు.. కాంట్రాక్టర్లకు కష్టాలు.

చెన్నై వరదలు కాంట్రాక్టర్లకు తిప్పలు కొనితెచ్చాయి. గతంలో స్మార్ట్ సిటీ వర్క్ ల పేరుతో అన్నాడీఎంకే హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లందరికీ చుక్కలు చూపెట్టడానికి సిద్ధమయ్యారు సీఎం స్టాలిన్. స్మార్ట్ సిటీ పనులపై ఎంక్వయిరీ కమిషన్ వేస్తున్నారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటి మంత్రి వేలుమణి హయాంలో ఒక్క పని కూడా సక్రమంగా జరగలేదని, కేంద్రం పంపించిన నిధుల్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు స్టాలిన్. 2015లో చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. […]

చెన్నైలో వర్షాలు.. కాంట్రాక్టర్లకు కష్టాలు.
X

చెన్నై వరదలు కాంట్రాక్టర్లకు తిప్పలు కొనితెచ్చాయి. గతంలో స్మార్ట్ సిటీ వర్క్ ల పేరుతో అన్నాడీఎంకే హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లందరికీ చుక్కలు చూపెట్టడానికి సిద్ధమయ్యారు సీఎం స్టాలిన్. స్మార్ట్ సిటీ పనులపై ఎంక్వయిరీ కమిషన్ వేస్తున్నారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటి మంత్రి వేలుమణి హయాంలో ఒక్క పని కూడా సక్రమంగా జరగలేదని, కేంద్రం పంపించిన నిధుల్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు స్టాలిన్.

2015లో చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. రోజుల తరబడి నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. అప్పటి అధికార అన్నాడీఎంకే నగర ప్రజలకు వరద కష్టాలు దూరం చేసేందుకు స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ చేపట్టింది. దీనికి కేంద్రం ఆర్థిక సాయం చేసింది. 5వేల కోట్ల రూపాయలతో పనులు జరిగాయి, పూర్తయ్యాయి కూడా. అయితే ఇప్పుడు మరోసారి వర్షాలొచ్చాయి. మళ్లీ చెన్నై నీటమునిగింది. అంటే 5వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే అనే విషయం అర్థమైంది. దీంతో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న సీఎం స్టాలిన్.. స్థానిక పరిస్థితులు చూసి షాకయ్యారు. అసలు స్మార్ట్ సిటీ పేరుతో పనులే జరగలేదని, ఎక్కడికక్కడ నిధుల మేత మేశారని గ్రహించారు. వెంటనే ఎంక్వయిరీ కమిషన్ వేయడానికి ఆదేశాలిచ్చారు.

డీఎంకే అధికారంలోకి వచ్చాక, డ్రైనేజీ కాల్వల విషయంలో శ్రద్ధ చూపెట్టారు. నగర పరిధిలోని 771 కిలోమీటర్ల మేర డ్రైనేజీల విస్తరణ, పూడిక తీత పనులు మొదలయ్యాయి. ఈ పనులు మొదలైన చోట మాత్రం వరదనీటి కష్టాలు లేవు. ఈ తేడా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోందని, గత ప్రభుత్వం చెన్నైని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అంటున్నారు స్టాలిన్. స్మార్ట్ సిటీ స్కామ్ ని బట్టబయలు చేస్తామంటున్నారు.

First Published:  10 Nov 2021 1:01 AM GMT
Next Story