Telugu Global
NEWS

ఏపీ స్కూళ్లలో మరుగుదొడ్ల శుభ్రతకు ఏటా రూ.444 కోట్లు ఖర్చు..

ఏపీలో స్కూళ్ల మరుగుదొడ్ల నిర్వహణపై ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చాయి. మరుగుదొడ్ల నిర్వహణకు ఉపాధ్యాయుల్ని బాధ్యులుగా చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో వారే టాయిలెట్స్ శుభ్రం చేయాల్సి వస్తోందనే విమర్శలు వినిపించాయి. మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న ఉపాధ్యాయుల ఫొటోలు కూడా బయటికొచ్చాయి. దీనిపై హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవని, స్కూళ్లలో మరుగుదొడ్ల పరిశుభ్రత కోసం ప్రతి ఏటా అక్షరాలా 444.89 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు […]

ఏపీ స్కూళ్లలో మరుగుదొడ్ల శుభ్రతకు ఏటా రూ.444 కోట్లు ఖర్చు..
X

ఏపీలో స్కూళ్ల మరుగుదొడ్ల నిర్వహణపై ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చాయి. మరుగుదొడ్ల నిర్వహణకు ఉపాధ్యాయుల్ని బాధ్యులుగా చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో వారే టాయిలెట్స్ శుభ్రం చేయాల్సి వస్తోందనే విమర్శలు వినిపించాయి. మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న ఉపాధ్యాయుల ఫొటోలు కూడా బయటికొచ్చాయి. దీనిపై హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవని, స్కూళ్లలో మరుగుదొడ్ల పరిశుభ్రత కోసం ప్రతి ఏటా అక్షరాలా 444.89 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.

ఏపీలోని 45,716 ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. ప్రతి 300 మంది పిల్లలకు ఒక సహాయకుడు చొప్పిన.. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు నియామకాలు జరిగాయి. వీరికి ప్రతి నెలా 6వేల రూపాయలు జీతం ఇస్తున్నారు. అమ్మఒడి డబ్బుల కేటాయింపుల్లో టాయిలెట్స్ శుభ్రం చేయడానికి అయ్యే ఖర్చుని కూడా కలిపారు. శుభ్రతకోసం అవసరమయ్యే సామగ్రిని కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయం పర్యవేక్షిస్తుంది. అయితే కొంతమంది పనిగట్టుకుని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆదిమూలపు సురేష్.

సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్ లను నమ్మొద్దని మంత్రి సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారిపోయాయని, అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఉపాధ్యాయులకు టాయిలెట్స్ శుభ్రం చేయాలని ఎవరూ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.

First Published:  9 Nov 2021 12:34 AM GMT
Next Story