Telugu Global
National

సోషల్ మీడియా కింగ్ లకే బీఎస్పీ టికెట్లు.. 4 అంచెల్లో ఇంటర్వ్యూలు..

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేయాలంటే.. టికెట్ దక్కించుకోడానికి ఓ రేటు ఉంటుందనే విమర్శలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. గతంలో బీఎస్పీ ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయంలో అధినేత్రి మాయావతిని నిలదీశారు. తాజాగా.. యూపీ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కి 2.3 కోట్ల రూపాయల బేరం పెట్టారని మిరాజ్ అలీ అనే నేత విమర్శలు గుప్పించారు. ఆయన ఆరోపణలను పార్టీ ఖండించడంతోపాటు.. ఇకపై ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండటానికి ఓ కొత్త విధానం ప్రవేశ […]

సోషల్ మీడియా కింగ్ లకే బీఎస్పీ టికెట్లు.. 4 అంచెల్లో ఇంటర్వ్యూలు..
X

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేయాలంటే.. టికెట్ దక్కించుకోడానికి ఓ రేటు ఉంటుందనే విమర్శలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. గతంలో బీఎస్పీ ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయంలో అధినేత్రి మాయావతిని నిలదీశారు. తాజాగా.. యూపీ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కి 2.3 కోట్ల రూపాయల బేరం పెట్టారని మిరాజ్ అలీ అనే నేత విమర్శలు గుప్పించారు. ఆయన ఆరోపణలను పార్టీ ఖండించడంతోపాటు.. ఇకపై ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండటానికి ఓ కొత్త విధానం ప్రవేశ పెట్టింది. పార్టీ టికెట్ కోరుకునేవారు నాలుగు అంచెల ఇంటర్వ్యూ పూర్తి చేయాలనే కండిషన్ పెట్టింది.

ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ లో ఆశావహులు వారి బయోడేటాను నియోజకవర్గ స్థాయి ఇన్ చార్జ్ లకు అప్పగించాలి. వారి బలాలు, బలహీనతల గురించి అక్కడ చర్చిస్తారు. ఆ తర్వాత రెండో రౌండ్ సోషల్ మీడియాకి సంబంధించింది. సోషల్ మీడియాలో ఎవరు ఎంత యాక్టివ్ గా ఉన్నారనే విషయాన్ని అంచనా వేస్తారు. స్థానికంగా మంచి బలమున్న నేత అయినా సరే.. సొంత సోషల్ మీడియా టీమ్ లేకపోతే పక్కనపెట్టేస్తారు. ఎప్పటికప్పుడు తమ కార్యక్రమాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ హడావిడి చేసేవారినే ఈ రౌండ్ లో సెలక్ట్ చేస్తారు. ఇక మూడో రౌండ్ లో స్థానిక సమస్యలపై వారికి ఉన్న అవగాహన అంచనా వేస్తారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావించడంతోపాటు, వాటికి పరిష్కార మార్గాలను కూడా అభ్యర్థులు సూచించాల్సి ఉంటుంది.

ఇక ఫైనల్ రౌండ్ మాయావతి టేబుల్ దగ్గర ఉంటుంది. స్వయంగా ప్రతి ఒక్క అభ్యర్థిని పార్టీ అధినేత్రి మాయావతి ఇంటర్వ్యూ చేస్తారు. టికెట్ ఎందుకు ఆశిస్తున్నారు, గతంలో నియోజకవర్గానికి వారు ఏం చేశారు, స్థానికంగా వారికి ఉన్న బలం, బలగం ఎంత..? అనేది ఆమె అంచనా వేస్తారు. దీనికితోడు పార్టీ అంతర్గత సర్వే ద్వారా ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. చివరిగా అభ్యర్థిత్వాన్ని మాయావతి ఖరారు చేస్తారు. విమర్శలను ఎదుర్కోడానికి బీఎస్పీ ఈ ఏడాది నుంచి ఆశావహులకు ఇంటర్వ్యూల పద్ధతిని ప్రవేశ పెడుతోంది.

First Published:  9 Nov 2021 12:52 AM GMT
Next Story